Alia Bhat కోర్టు చిక్కుల్లో గంగూభాయ్ కతియావాడి మూవీ.. ఆ పేరు తొలగించండి అంటూ పిటిషన్

బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటించిన గంగూభాయ్ కతియావాడి చిత్రం ఇబ్బందుల్లో పడింది. ముంబైలోని కమటిపుర ప్రాంతం పేరును సినిమాలో ఉపయోగించడంపై అభ్యంతరం చెబుతూ మహారాష్ట్ర ఎమ్మెల్యే అమీన్ పటేల్, ఆ ప్రాంతపు నివాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాను సెన్సార్ బోర్డు మరోసారి వీక్షించి కమటి పురా పేరును సినిమా నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కేసు వివరాల్లోకి వెళితే...

గతంలో ప్రపంచంలోనే అతిపెద్ద వేశ్యవాటికగా పేరున్న కామటిపుర పేరును సినిమాలో వాడుకోవడంపై అభ్యంతరవం వ్యక్తం చేస్తూ ఆ ప్రాంతపు వాసి శ్రద్దా సుర్వే పిటిషన్ దాఖలు చేశారు. శ్రద్దా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ గౌతమ్ పటేల్, మాధవ్ జమెదార్ పరిగణనలోకి తీసుకొని మంగళవారం విచారించారు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బుధవారం మరోసారి విచారించింది.. పిటిషన్ తీవ్రతను బట్టి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.

Alia Bhatts Gangubai Kathiawadi in Court Troubles, MLA files petition on Sanjay Leela Bhansali movie

ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే అమీన్ పటేల్ కూడా కామటిపుర చెడ్డ ప్రాంతంగా చూపించే ప్రయత్నం చేయడం, ఆ ప్రాంతపు పేరును వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. కామటిపురా ప్రాంతం పేరున సినిమాలో ఉపయోగిస్తే.. ఆ ప్రాంతపు ప్రజల మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐదుశాతం మేర కూడా వ్యభిచారం జరగడం లేదు. కాబట్టి ఈ పేరును సినిమా నుంచి తొలగించాలి. అంతేకాకుండా మాయాపురి, మాయానగరి పేరుగా మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ఒకవేళ అదే పేరు వాడితే ఆ ప్రాంతపు అమ్మాయిలను వ్యభిచారులుగా గుర్తించే పొరపాటు జరిగే ప్రమాదం ఉంది అని అన్నారు. దాంతో ఆయన పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కార్నిక్ బుధవారం విచారించనున్నారు.

గంగూభాయ్ కతియావాడి స ినిమా విషయానికి వస్తే.. రచయిత ఎస్ హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కింది. 1960లో కామటి పురాను తన కనుసన్నల్లో శాసించిన గుంగూభాయ్ క్యారెక్టర్‌ను ఆలియాభట్ పోషించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X