అలియాభట్ కుటుంబంలో తీవ్ర విషాదం.. 93 ఏళ్ల వయసులో కూడా అంటూ ఆవేదన
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కుటుంబంలో విషాదం చోటుచేసుకొన్నది. అలియాభట్ తల్లి సోని రజ్దాన్ తండ్రి నరేంద్ర రజ్దాన్ కన్నుమూశారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. గత కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దాంతో పలువురు సినీ ప్రముఖులు ఆలియాభట్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆలియా భట్ తాత మరణం విషయంలోకి వెళితే..
అనారోగ్యంతో బాధపడుతున్న నరేంద్ర రజ్దాన్‌ను గతవారం రోజుల క్రితం ముంబైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన పరిస్థితి క్రిటికల్‌గా మారడంతో వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దాంతో అలియాభట్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

ఇటీవల తన తాత నరేంద్ర రజ్దాన్ గురించి మాట్లాడుతూ.. నాకు మా తాత హీరో. నా తాత 93 సంవత్సరాలు వచ్చేంత వరకు గోల్ఫ్ ఆడారు. 93 ఏళ్ల వయసులో కూడా సొంతంగా ఆయన పనులు ఆయనే చేసుకొన్నారు. ఆయన ఆమ్లేట్స్ వేయడంలో ఆయనకు ఆయనే సాటి. మంచి కథలు చెప్పేవారు అని తనతో అనుబంధాన్ని అలియా గుర్తు చేసుకొన్నారు.
వాయోలిన్ వాయించే వారు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకొనే వారు. క్రికెట్ అంటే ఆయనకు చాలా ఇష్టం. స్కేటింగ్ కూడా చేసేవారు. అన్నింటికన్నా ముఖ్యం కుటుంబాన్ని బాగా, ప్రేమగా చూసుకొనే వారు అని ఆలియాభట్ ఎమోషషనల్ అయ్యారు.
తాత నరేంద్ర రజ్దాన్ మరణంతో ఆలియాభట్ విషాదంలో మునిగిపోయారు. నా తాత మరణం ఓ విషాదాన్ని, మరోవైపు ఆనందాన్ని కలిగిస్తున్నది. ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించారు. మాకు ఎన్నో అనుభవాలను పంచారు. ఆయన లేని లోటు తీర్చలేనిది. కానీ జీవితాంతం మా మనసులో ఉండిపోతారు అని ఆలియా భట్ ట్వీట్ చేసింది. కరణ్ జోహర్, తదితరులు ఆమెకు సంతాపం తెలిపారు.
తాత నరేంద్ర రజ్దాన్ అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరడంతో దుబాయ్‌లో జరిగే ఐఫా వేడుకలకు దూరంగా ఉన్నారు. ఐఫా అవార్డుల్లో విజేతలకు ఆమె ఇటీవల విషెస్ కూడా తెలిపారు.


Click it and Unblock the Notifications











