Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆలియాభట్ క్లిప్పింగ్ లీక్.. ఇంటర్నెట్లో వైరల్!
Recommended Video
అందాల భామ ఆలియాభట్‌కు బాలీవుడ్లో ఘనమైన వారసత్వం ఉన్నా ఏనాడు దానిని ఉపయోగించుకోలేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆలియా తర్వాత ఎదురుచూసుకోలేదు. హైవే, డియర్ జిందగీ, ఉడ్తా పంజాబ్, రాజీ చిత్రాలు ఆమె నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. ప్రస్తుతం ఆమె నటించిన గల్లీభాయ్ విడుదలకు సిద్ధంగా ఉంది. కాలాంక్, బ్రహ్మస్త్ర చిత్రాల్లో నటిస్తున్నది. కాలాంక్ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో లీక్ అయి ఇంటర్నెట్లో సెన్సేషనల్‌గా మారింది. అదేమిటంటే...
వరుణ్ ధావన్‌తో నాలుగోసారి
కాలాంక్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో హీరో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తున్నది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన హంప్టీశర్మకి దుల్హనియా, బద్రీనాథ్‌కి దుల్హనియా సినిమాలు ఘనవిజయం సాధించాయి. మళ్లీ నాలుగోసారి ఈ సినిమా కోసం జతకట్టారు.
గ్వాలియర్‌లో పాట చిత్రీకరణ
కాలాంక్ సినిమాకు సంబంధించిన పాటను ఇటీవల గ్వాలియర్ పట్టణంలో చిత్రీకరించారు. పెళ్లి వేడుక నేపథ్యంగా ఈ చిత్రీకరణ సాగినట్టు వీడియోలో స్పష్టమైంది. ఈ పాటలో సంప్రదాయ దస్తుల్లో కనిపించి ఆలియా అదరగొట్టింది.
ఇంటర్నెట్లో వీడియో క్లిప్పింగ్
కాలాంక్ సినిమా షూటింగ్ కోసం చిత్రీకరించిన పాటకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆలియా డ్యాన్స్ చేస్తున్న వీడియో ట్రెండింగ్ మారింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో వరుణ్ ధావన్ ట్విట్టర్లో ఓ ఫోటోను షేర్ చేశాడు.
|
వరుణ్ ధావన్ ట్వీట్
కాలాంక్ సినిమా షూట్ పూర్తయింది. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాల్లో ఇదే భారీ బడ్జెట్ చిత్రం. ఆలియాభట్‌తో ఇది రెండోది. మా ఫ్యాన్స్‌ను హ్యాపీగా ఉంచడానికి మేము బాగా కష్టపడ్డాం.ఈ సినిమా విజయం కోసం ఎదురుచూస్తున్నాం అని వరుణ్ ధావన్ తెలిపారు.
మాధురీ దీక్షిత్, సోనాక్షి, సంజయ్ దత్
వరుణ్ ధావన్, ఆలియా నటిస్తున్న కాలాంక్ చిత్రానికి నిర్మాత కరణ్ జోహర్. ఈ చిత్రానికి అభిషేక్ వర్మన్ దర్శకుడు. ఈ చిత్రంలో మాధురి దీక్షిత్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్, కునాల్ కేము, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్నారు. దేశ విభజన నేపథ్యంగా ఈ కథ జరుగుతుందనే సినీ వర్గాల టాక్. కాలాంక్ను ఏప్రిల్ 19 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.