అయితే పాకిస్థాన్ వెళ్లిపో... అలియా భట్ తల్లిపై విమర్శలు, ఏం జరిగిందంటే?
Recommended Video

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తల్లి, మాజీ నటి సోని రజ్దాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. కొన్ని సార్లు పాకిస్థాన్ వెళితే సంతోషంగా ఉంటాననే భావన తనలో కలుగుతుందని ఆమె వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం.
తన తాజా చిత్రం 'నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్' మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనీ రజ్దాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో నెలకొన్ని పరిస్థితులపై స్పందించాలని కోరగా... తాను తన మనసులోని భావాలను చెబితే జాతి వ్యతిరేకి అనే ముద్ర వేస్తారని తెలిపారు.

వారు అలా అన్నపుడు పాకిస్థాన్ వెళ్లిపోవాలనిపిస్తుంది
‘‘నా అభిప్రాయాలతో విభేదించే వారు నన్ను పాకిస్థాన్ వెళ్లిపోవాలని అంటుంటారు. వారు అలా అన్నపుడు అక్కడికి వెళిపోతేనే సంతోషంగా ఉంటుందనే భావన కొన్నిసార్లు కలుగుతుందని, అక్కడ కూడా మంచి ఆహారమే దొరుకుతుంది.'' అని సోనీ రజ్దాన్ వ్యాఖ్యానించారు.

అక్కడికే వెళ్లి సెటిలవ్వండి
అయితే సోనీ రజ్దాన్ వ్యాఖ్యలు చాలా మంది భారతీయులకు రుచించలేదు. వెంటనే ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇండియా కంటే పాకిస్థాన్ బావుంటుంది అనుకుంటే అక్కడికి వెళ్లి సెటిలవ్వండి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సోనీ రజ్దాన్ వివరణ
తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై సోనీ రజ్దాన్ స్పందించారు. పర్మినెంటుగా పాకిస్థాన్ వెళ్లి సెటిలవ్వాలనేది తన ఉద్దేశ్యం కాదని, ఆ దేశానికి వెకేషన్ వెళితే బావుంటుందనేది తన అభిప్రాయమని వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా సోనీ రజ్దాన్ వ్యాఖ్యలు ‘నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్' సినిమాపై అటెన్షన్ పెరిగేలా చేశాయి.

నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్
‘నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్' చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. కాశ్మీర్ లోయలో పరిస్థితులకు అద్ధం పడుతూ... కనిపించకుండా పోయిన తమ తండ్రులను వెతుకుతున్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. జారా వెబ్, సోనీ రజ్దాన్, శివం రైనా, అశ్విన్ కుమార్, కుల్ భూషణ్ కర్బంద, అన్షుమాన్ ఝా, నటాషా మాగో ముఖ్య పాత్రలు పోషించారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











