దీపిక, కత్రినాకు అలియాభట్ చెక్.. ఆ హీరో, డైరెక్టర్‌తో బెర్త్ కన్ఫర్మ్!
పద్మావత్ తర్వాత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మరో చిత్రం ఇన్షా అల్లా. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్నారు. హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా తర్వాత మళ్లీ 20 ఏళ్లకు వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కావడం విశేషం. అయితే సల్మాన్ సరసన నటించేందుకు దీపికా పదుకోన్, కత్రినా కైఫ్ పేర్లు వినిపించాయి. అయితే ఈ సారి దీపికాను పక్కన పెట్టి అలియాభట్‌కు ఓటు వేయడం బాలీవుడ్‌లో చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే

దబాంగ్ 3 మూవీ తర్వాత
సల్మాన్ నటిస్తున్న దబాంగ్3 సినిమా తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. పద్మావత్ చిత్రాని కంటే ముందే సంజయ్ లీలా భన్సాలీ కథ చెప్పగా సల్మాన్ ఎక్సైటింగ్ అయినట్టు.. వెంటనే సినిమాను చేయడానికి ముందుకు వచ్చినట్టు బాలీవుడ్ మీడియా కథనాన్ని వెల్లడించింది.

ఇన్షా అల్లాలో అలియా భట్
ఇన్షా అల్లా సినిమాలో ఆఫర్ దక్కడంపై అలియా సోషల్ మీడియలో ఆనందం వ్యక్తం చేశారు. నా వయసు 9 ఏళ్లు ఉన్నప్పుడు సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్‌కు వెళ్లిన గుర్తు ఉంది. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో అవకాశం దక్కాలని దేవుడిని ప్రార్థించాను. చాలా రోజులుగా వేచి చూసిన దానికి ఫలితం దక్కింది అని అలియా ట్వీట్ చేసింది.

నా కల సాకారమైందని అలియా
ఇన్షా అల్లా సినిమాలో అవకాశం కన్ఫర్మ్ కావడంతో నా కలలు సాకారం అయ్యాయి అనే ఫీలింగ్ కలిగింది. సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్ కలువడం ఓ మ్యాజిక్. ఈ జర్ని ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని ఎదురుచూస్తున్నాను అని అలియా ట్వీట్‌లో పేర్కొన్నది.

20 ఏళ్ల తర్వాత సంజయ్‌తో సల్మాన్ ఖాన్
హమ్ దిల్ దే చుకే సనమ్ చిత్రం తర్వాత 20 ఏళ్లకు సంజయ్ లీలా భన్సాలీతో జతకట్టాను. ఆయన రూపొందించే తదుపరి చిత్రం ఇన్షా అల్లాలో నటిస్తున్నాను. అలియాతో జతకట్టేందుక ఎదురుచూస్తున్నాను. నిజంగా ఈ చిత్రంలో నేను నటించడం గొప్ప అదృష్టం అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం 2020లో రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











