twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతనికి లవ్ ఎఫైర్ ఉందని తెలుసు.. అయితే ఏంటి? నాకు మాత్రం.. ఆలియా భట్

    |

    బాలీవుడ్ భామ ఆలియా భట్, రణ్‌బీర్‌ కపూర్‌ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. గతంలో సోన‌మ్‌, దీపిక‌, క‌త్రినాల‌తో ప్రేమాయ‌ణాలు సాగించిన ర‌ణ్‌బీర్ కపూర్ ప్ర‌స్తుతం ఆలియాతో ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు. అతిత్వరలోనే ఆలియా- రణ్‌బీర్‌ కపూర్‌ ఒక్కటి కానున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రణ్‌బీర్‌ కపూర్‌ పై తనకున్న ఇష్టాన్ని ఎన్నోసార్లు ఆలియా బయటపెట్టడం ద్వారా ఈ ఇద్దరి పెళ్లి ఫిక్స్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు బీ టౌన్ జనం.

    గతంలో కూడా రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ విదేశీ ప్రయాణం పలు చర్చలకు దారితీసింది. కొద్ది రోజులుగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరూ కలిసి యూరోప్ వెళ్లడంతో.. పెళ్లి కోసమే ఈ జంట యూరోప్ చెక్కేసిందనే వార్తలు పుట్టుకొచ్చాయి. అప్పటి నుంచి రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్ జాణతపై వార్తలు జోరందుకున్నాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య ఉన్న ప్రేమ బంధం వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఆలియా భట్. ఈ మేరకు ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌ ని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడింది.

     Alia Bhatt Says About Her Love With Ranbir Kapoor

    రణ్‌బీర్‌ కపూర్‌ వ్యక్తిత్వం చాలా మంచిదని అంటోంది ఆలియా. మొదట తమ మధ్య స్నేహ బంధం ఉండేదని, ఆ తరువాత అది ప్రేమగా చిగురించిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వృత్తి పట్ల ఇద్దరం చాలా బిజీగా ఉన్నామని చెబుతోంది ఆలియా. అయితే తమపై ఎవ్వరి కళ్లు పడకూడదని చెబుతూ.. ఉదయం లేచినప్పటి నుంచి మొదలు రణ్‌బీర్‌తో మీ పెళ్లెప్పుడు అని మీడియా అడగడం చాలా చిరాగ్గా అనిపిస్తుందని తెలిపింది ఆలియా. గతంలో రణ్‌బీర్‌ కి ప్రేమ వ్యవహారాలు ఉన్న విషయం తనకు తెలుసని, తనకు మాత్రం అలాంటివి లేవా? ఏంటి.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అవన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. వాటన్నింటికీ అలవాటు పడిపోయాం అని అంటోంది అలియా.

    ఆలియా, ర‌ణ్‌బీర్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్ర‌ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా విడుద‌ల కాగానే వీరిద్ద‌రూ ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నార‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో రానున్న RRR ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది ఆలియా.

    English summary
    Ranbir Kapoor and Alia Bhatt recently fly to Europe for a romantic journey. This set tongues wagging and whispers began doing the rounds. In latest interview Alia Bhatt says about their love
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X