రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లి ఎప్పుడో అయిపోయింది.. దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చిన అలియా భట్
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా హాట్ టాపిక్గా కొనసాగుతున్న అలియా భట్, రణ్‌బీర్ పెళ్లికి ఎప్పుడు సరైన సమాధానం దొరుకుతుంది అనే విషయంలో అనేక రకాల సందేహాలు వెలువడుతున్నాయి. ఇద్దరు స్టార్ కపుల్స్ కూడా చాలాసార్లు ఇన్ డైరెక్ట్ గానే వారి పెళ్లి పై స్పందించడం జరిగింది. అయినప్పటికీ ఎన్నో రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఫైనల్ గా ఇటీవల అలియా భట్ మరోసారి వీరి బంధం పై ఎవరూ ఊహించని విధంగా స్పందించింది. ఇది వరకే తమ ఇద్దరికీ పెళ్లి అయిపోయింది అంటూ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. ఇంతకూ ఆమె ఏ విధంగా అలా మాట్లాడింది అనే విషయంలోకి వెళితే..

అలియా ప్రధాన ఆయుధం
గ్లామరస్ బ్యూటీగా బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న ఆలియా భట్ మరోవైపు సౌత్ ఇండస్ట్రీలో కూడా తన స్థాయిని పెంచుకోవాలి అని ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రధాన ఆయుధం RRR అని చెప్పాలి. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆలియా భట్ నేషనల్ వైడ్ గా అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ గా కూడా చక్రం తిప్పుతుంది.

బాయ్ ఫ్రెండ్ తో బిగ్ మూవీ
అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాను రాజమౌళి ప్రత్యేకంగా ప్రజెంట్ చేస్తుండగా నాగార్జున కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాతో కూడా ఈ బ్యూటీ బిగ్గెస్ట్ హిట్ అనుకునే అవకాశం అయితే గట్టిగానే ఉంది.

పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ..
అయితే చేతిలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా ఆలియా భట్ నిత్యం తన బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన గాసిప్స్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇక వీరు ఇద్దరూ కూడా గత ఏడాది పెళ్లికి సిద్ధమైనట్లు గా కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ ఏడాది కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇప్పటికీ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇక అలాంటి కథనాలు ఎన్ని వచ్చినా కూడా ఇద్దరూ ఏమాత్రం పట్టించుకోకుండా వారి సినిమాలతో బిజీ అవుతూ వచ్చారు.

ఎప్పుడో పెళ్లయ్యింది
ఇక ప్రస్తుతం ఆలియా భట్ గంగూభాయ్ ఖతియావాడి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. కాబట్టి మీడియా తరచుగా పెళ్లి కథనాలపై ప్రశ్నిస్తూ ఉండడంతో ఓపిక పట్టలేక ఆలియాభట్ మా ఇద్దరికీ ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది అంటూ కుండబద్దలు కొట్టేసింది. ఒక నిమిషం వరకు కూడా అందరూ ఆమె చెప్పిన సమాధానానికి అవాక్కయ్యారు.

అంగరంగ వైభవంగా
ఇక తమ పెళ్లి ఎప్పుడు జరిగినా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పిన అలియా.. నా మైండ్ ఇప్పటికే రణ్‌బీర్ కపూర్ తో పెళ్లయిందిని సున్నితంగా ఆన్సర్ ఇచ్చేసింది. నేను అతనితో చాలా కాలం క్రితమే వివాహం చేసుకున్నానని అనుకుంటున్నాను అంటూ సంప్రదాయం ప్రకారమే రణ్‌బీర్ తో పెళ్లి జరగాల్సి ఉందని చెప్పింది. ఇక మనసులు కలిసిన తరువాత అంతకంటే గొప్ప పెళ్లి మరొక ఉండదనే విధంగా కూడా అమ్మడు ఆన్సర్ ఇవ్వడం విశేషం.

బిజీగా ఉన్నాము కాబట్టి..
ఇక అసలైన పెళ్లి ఎప్పుడు అనే విషయంలో మరోసారి స్పందించిన అలియా భట్ ప్రస్తుతం ఇద్దరం కూడా తమకు ఇష్టమైన సినిమా కెరీర్ లో బిజీగా ఉన్నాము కాబట్టి అనువైన రోజున తప్పకుండా పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చింది. మరి పెళ్లి తో యే జంట అభిమానులు ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారో చూడాలి. ఇదిలా ఉండగా అలియా సినిమాల విషయానికి వస్తే రణ్‌బీర్ తో చేసిన బ్రహ్మాస్త్ర 2022 సెప్టెంబర్ 9న విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం, అలియా తన తదుపరి చిత్రం గంగూబాయి కతియావాడిని ప్రమోట్ చేస్తోంది. ఇది ఫిబ్రవరి 25 ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











