టాలీవుడ్ ఎక్కువ ఫోకస్ పెట్టిన RRR బ్యూటీ.. ఆ సినిమాలు ఫిక్స్ అయితే వాళ్ళకు కష్టమే!

ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత మాత్రం గట్టిగానే ఉందని చెప్పవచ్చు. ఒకప్పటి స్టార్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా, నయనతార, అనుష్క వంటి వాళ్లు నటిస్తున్నప్పటికీ కూడా నేటి తరం స్టార్ హీరోలు వారిని మళ్ళీ రిపీట్ చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఏదో ముఖ్యమైన పాత్రలకు అవసరం ఉంటే తప్ప సీనియర్ హీరోలు వారి వైపు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు అని చెప్పాలి. అది కూడా దర్శకులు నుంచి ఎక్కువ ఒత్తిడి వస్తేనే సీనియర్ హీరోయిన్లకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని ఒక టాక్ అయితే వస్తుంది. ఇక ప్రస్తుతం కొంతమంది హీరోయిన్లు పాన్ ఇండియా సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే దాదాపు అందరు హీరోలు కూడా ఎక్కువగా పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. ఒక్కసారి ఆ మార్కెట్ వర్కౌట్ అయితే అంతకు మించి అనేలా మరొక పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక హీరోలకు మాత్రమే కాకుండా హీరోయిన్స్ కు కూడా అది బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే అన్ని భాషల్లోనూ సినిమా విడుదలైతే ఈజీగా రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా అదే తరహాలో పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. ఇక అప్పుడప్పుడు ఆమెకు పోటీగా రష్మిక మందన్న కూడా బిగ్ బడ్జెట్ సినిమాలతో పోటీగా నిలుస్తోంది.

Alia bhatt special focus on two big south indian projects

ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్స్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ లో ఉన్నారు అని చెప్పవచ్చు. ఇక వీరికి పోటీగా మధ్యలో కీయరా అద్వానీ కూడా కొన్ని సినిమాలను తనవైపు లాగేసుకుంటుంది. త్వరలోనే ఆలియా భట్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ పై ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. RRR సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటించిన ఈ బాలీవుడ్ బ్యూటీ అంతకు ముందు వరకు కూడా తెలుగు సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ ప్రస్తుతం మన తెలుగు హీరోలు నేషనల్ వైడ్ గా మార్కెట్ ను సెట్ చెక్ చేసుకుంటూ ఉండటంతో తెలుగు సినిమాలు చేసేందుకు ఆమెకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక ప్రస్తుతం పెద్ద సినిమాల్లో పూజా హెగ్డే రష్మిక మందన్న వంటివారు మాత్రమే ఆప్షన్ గా ఉన్నారు కాబట్టి వారికి పోటీగా నిలిచేందుకు అలియా భట్ కూడా తెలుగు వారికి దగ్గరవ్వాలని చూస్తోంది. ఇక త్వరలోనే కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో కూడా ఈ బ్యూటీకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అలాగే మరొక మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రెండు సినిమాలు వర్కౌట్ అయితే టాలీవుడ్ లో ఆమె బిజీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక కొరటాల శివ మొదట కీయరా అద్వానిని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నాడు కానీ ఆ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు రామ్ చరణ్ సినిమాను కూడా ఇటీవల మొదలుపెట్టింది. అందుకే ఓకే చేయలేకపోయింది. ఇక మరొక ఆప్షన్ గా ప్రస్తుతం అలియాభట్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. మరి ఈ బ్యుటి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X