Met Gala 2023: ముత్యాలు పొదిగిన డ్రెస్సులో వజ్రంలా మెరిసిన అలియా.. ఇలా చూస్తే స్టన్ అవ్వాల్సిందే!

హైలీ టాలెంటెడ్ బాలీవుడ్ హీరోయిన్స్ లలో అలియా భట్ ఒకరు. అందానికి అందం, అభినయానికి అభినయం ఈ అమ్మడి సొంతం. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తుంది. కేవలం హిందీ చిత్రాల్లోనే కూడా తెలుగులో వచ్చిన RRR సినిమాలో సీత పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది.

కనిపించేది కాసేపే అయినా తన ప్రతిభతో ముద్ర వేసేసింది. ఇక అమ్మడు ఎలాంటి డ్రెస్ వేసినా కూడా ఆ డ్రెస్సుకే అందం వచ్చేస్తుంది. ఇక ఇటీవల మెట్ గలా ఈవెంట్ లో రెడ్ కార్పెట్ పై అందంగా మెరిసింది. ఇక ఆ ఫొటోల వివరాల్లోకి వెళితే..

Alia Bhatt steals the show in a pearl-studded gown at Met Gala 2023

తల్లి అయిన తర్వాత కూడా: పెళ్లై, తల్లి అయిన తర్వాత కూడా అలియా భట్ తన అందాల ఆరబోతతో కుర్రాళ్లను ఆగం చేస్తోంది. ఈ బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ తాజాగా మెట్ గాలా ఈవెంట్ లో పాల్గొంది. మెట్ గాలా 2023 ఈవెంట్ హుషారుగా సాగుతోంది. ఈ ఈవెంట్ లో మొదటిసారిగా అలియా భట్ పాల్గొంది. ముత్యాలు పొదిగిన గౌను ధరించి అలియా భట్ హొయలొలికించింది. అద్భుతమైన ఈ డ్రెస్సు లో అప్సరసలా మెరిసిపోయింది అలియా.

Alia Bhatt steals the show in a pearl-studded gown at Met Gala 2023

మెట్ గాలా 2023 ఈవెంట్: వైట్ అండ్ వైట్ గౌనులో దివి నుండి భువికి దిగివచ్చిన దేవకన్యలా కనిపించింది ఈ బాలీవుడ్ బ్యూటీ. మెట్ గాలా 2023 స్టెప్స్ లో అలియా భట్ యువరాణిలా మెరిసిపోయింది. చానెల్ కోచర్ బ్రైడ్స్ నుండి ఇన్‌స్పైర్ అయి డిజైనర్లు అలియా ఔట్ ఫిట్ ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఈ ఔట్ ఫిట్ పైకి రైట్ హ్యాండ్‌కు వైట్ కలర్ ఫింగర్‌లెస్‌ గ్లోవ్‌ ధరించింది.

Alia Bhatt steals the show in a pearl-studded gown at Met Gala 2023

అందరి ఫోకస్ ఆమెపైనే పడింది: ఇక అలియా అలా రెడ్ కార్పెట్ పై నడుస్తూ ఉండే అందరి ఫోకస్ ఆమెపైనే పడింది. గతంలో చాలాసార్లు బికినీ అందాలతో కూడా మంత్రముగ్దులను చేసిన అలియా ఈసారి ఇలా వైట్ డ్రెస్ లో మరింతగా ఆకర్షించింది. ఆమె కాస్ట్యూమ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆమె అందంతోనే ఆ డ్రెస్ కు సరికొత్తగా అందం తీసుకు వచ్చింది అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Alia Bhatt steals the show in a pearl-studded gown at Met Gala 2023

నాలుగు వేళ్లకు నాలుగు రింగ్స్: ఎడమ చేతి నాలుగు వేళ్లకు నాలుగు రింగ్స్ పెట్టుకుంది. లోనెక్ నుండి ఎద అందాలు ఆరబోసింది. మెడలో ఎలాంటి నెక్ పీస్ ధరించకుండా స్టైల్ ను క్యారీ చేసింది. చెవులకు ముత్యాలు పొదిగిన డిజైనర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. పోనీ టెయిల్ హెయిర్ స్టైల్ అదిరిపోయింది. ప్రతి సంవత్సరం మే నెల మొదటి సోమవారం జరిగే మెట్ గాలా ఈవెంట్ లో ఈ ఏడాది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తో పాటు ప్రియాంక చోప్రా పాల్గొంది.

ప్రియాంక చోప్రా బ్లాక్ కలర్ వెస్టర్న్ ఔట్ ఫిట్ లో కనిపించి కవ్వించింది. ఇక అలియా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమెకు RRR సక్సెస్ తరువాత మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే కరణ్ జోహార్ దర్శకత్వంలో రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ అనే సినిమా చేస్తోంది. అలాగే ఒక అమెరికన్ స్పై సినిమాలో కూడా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X