Alia Bhatt: చిట్టి బేబీ బంప్​తో అలియా భట్.. హాట్​ టాపిక్​గా పింక్​ డ్రెస్.. ధర ఎంతంటే ?

స్టూడెంట్​ ఆఫ్​ ది ఇయర్​ మూవీతో హిందీ చిత్రసీమకు హీరోయిన్​గా పరిచయమైన ముద్దుగుమ్మ అలియా భట్​. ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడు మహేశ్ భట్​ కుమార్తెగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈ క్యూట్​ గుమ్మ తర్వాత తన నటనతో అభిమానులను సంపాదించుకుంది. 2 స్టేట్స్​, హైవే, డియర్​ జిందగీ, ఉడ్తా పంజాబ్, రాజీ, గల్లీ బాయ్​, కలంక్​ వంటి తదితర సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే ఇటీవలే దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRR​ సినిమాలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇక అలియా భట్​ వ్యక్తిగత జీవితానికొస్తే బాయ్​ఫ్రెండ్​ రణ్​బీర్​ సింగ్​ వివాహామాడిన అలియా రెండు నెలలకే అభిమానులకు గుడ్​ న్యూస్ చెప్పింది.

 నటనతో ప్రశంసలు..

నటనతో ప్రశంసలు..

ఇటీవల గంగుబాయ్ కతియావాడి చిత్రంలో నటించి తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇందులో అలియా భట్​ యాక్టింగ్​, డైలాగ్ డెలివరీకి విశేష స్పందన లభించింది. అలాగే మరోవైపు RRR​తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 రణ్​బీర్​తో తొలిసారిగా..

రణ్​బీర్​తో తొలిసారిగా..

ఇదిలా ఉంటే ప్రస్తుతం తన భర్త, బాలీవుడ్​ హీరో రణ్​బీర్​తో కలిసి తొలిసారిగా బ్రహ్మాస్త్ర సినిమాలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్​ 9న బ్రహ్మాండగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్​లో పాల్గొంటుంది ఈ జంట.

 2 నెలలకే..

2 నెలలకే..

అయితే అలియా భట్, రణ్​బీర్ కపూర్ పెళ్లయిన రెండు నెలలకే ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్ చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్​ మీడియా వేదికగా ప్రకటించారు. అయినా కూడా అలియా రెస్ట్ తీసుకోకుండా ప్రమోషన్స్​ చేస్తోంది.

 హాట్​ టాపిక్​గా ఫొటోలు..

హాట్​ టాపిక్​గా ఫొటోలు..

అప్పుడప్పుడు భర్త రణ్​బీర్​తో కలిసి బయటకు వెళ్తోంది. ఈ క్రమంలోనే అలియా పలువురిని ఆకర్షిస్తోంది. ఆమె వేసుకునే డ్రెస్​లపైనే అందరి దృష్టి ఉంటుంది. అయితే తాజాగా అలియా భట్​ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం హాట్​ టాపిక్​గా మారాయి.

 బేబీ బంప్​తో అలియా..

బేబీ బంప్​తో అలియా..

ఇందులో బ్లాక్ డ్రెస్​లో రణ్​బీర్​ కనిపించగా, బేబీ బంప్​తో దర్శనమిచ్చిన అలియా భట్ వేసుకున్న పింక్ డ్రెస్​ గురించి చర్చ నడుస్తోంది. కాస్త పారదర్శకంగా ఉన్న ఆ టాప్​లో అలియా భట్​ బేబీ బంప్​ కూడా బయటకు కనిపించేలా ఉంది.

 పింక్ డ్రెస్ ఖరీదు ఎంతంటే?

పింక్ డ్రెస్ ఖరీదు ఎంతంటే?

​​ప్రస్తుతం ఈ చర్చంతా ఆ పింక్ డ్రెస్​ పైనే. సాఫ్ట్​ మెటీరియల్​తో కుట్టిన ఈ డ్రెస్​.. అంతర్జాతీయ బ్రాండ్​ గూచికి చెందింది. దీన్ని అలియా భట్​ వ్యక్తిగత స్టైలిస్ట్​ రూపొందించారు. దీని ఖరీదు రూ. 3,27,173 అని టాక్. ఈ రఫెల్ షిఫాన్​ టాప్​ మీద బ్లాక్​ జెగ్గింగ్స్​ వేసుకుని అలియా అందంగా కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X