For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వేశ్య‌గా ఆలియాభట్.. ఎవరీ గంగూభాయ్ కతియావాడి.. ముంబై రెడ్‌లైట్ ఏరియాలో జరిగిన కథేంటి?

  |

  బాలీవుడ్ యువతార ఆలియా భట్ అద్భుతమైన పాత్రలతో వెండితెర మీద నట విన్యాసం చేస్తున్నారు. హైవే, 2 స్టేట్స్, ఉడ్తా పంజాబ్, రాజీ, గల్లీభాయ్ లాంటి చిత్రాల్లో భావోద్వేగమైన పాత్రల్లో కనిపించిన ప్రతిభవంతురాలైన నటి ప్రస్తుతం గంగూభాయ్ కతియావాడి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌ దర్శకులు రాజమౌళితోపాటు ఎందర్నో ఆకట్టుకొన్నది. ఆలియా భట్ పోషిస్తున్న గంగూభాయ్ పాత్ర గురించిన వివరాల్లోకి వెళితే...

  ప్లేస్ ఏదైనా సరే... కన్నుకొట్టి సైగ చేస్తున్న కియారా అద్వానీ..

  సంజయ్ లీలా భన్సాలీ బర్త్‌డే రోజున

  సంజయ్ లీలా భన్సాలీ బర్త్‌డే రోజున

  ఆలియా భట్ నటిస్తున్న గంగూభాయ్ కతియావాడి సినిమాకు సంబంధించిన టీజర్ మంగళవారం రిలీజైంది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ బర్త్ డే రోజును పురస్కరించుకొని విడుదలైన ఈ టీజర్ సాధారణ ప్రేక్షకులనే కాకుండా సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకొన్నది. రాజమౌళి, రాంచరణ్ ట్వీట్ చేసి ఆలియాభట్‌పై ప్రశంసలు గుప్పించారు.

  గుజరాత్‌కు చెందిన యువతిగా

  గుజరాత్‌కు చెందిన యువతిగా

  ఆలియా భట్ పోషించిన గంగూభాయ్ పాత్ర గురించిన వివరాల్లోకి వెళితే.. సాధారణ యువతి అయిన గంగూభాయ్ అసలు పేరు గంగా హర్జివందాస్ కతియావాడి. గుజరాత్‌కు చెందిన యువతి తన 16వ ఏట ప్రేమలో పడి.. తల్లిదండ్రల నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రియుడితో ముంబైకి లేచిపోయి పెళ్లి చేసుకొంది.

  ఆశా పరేఖ్, హేమామాలిని స్ఫూర్తితో

  ఆశా పరేఖ్, హేమామాలిని స్ఫూర్తితో

  రచయిత హుస్సేన్ జైదీ తన పుస్తకంలో పేర్కొన్న ప్రకారం... గంగూభాయ్‌కి చిన్నతనం నుంచి సినీ నటి కావాలే కోరికతో ఉన్న గంగూభాయ్‌.. ఆశా పరేఖ్, హేమామాలిని ఆదర్శంగా తీసుకొని సినీ పరిశ్రమలోకి ప్రవేశించాలనే ప్రయత్నాలు చేసింది. అయితే ప్రేమించిన భర్త చేతిలో దారుణం వంచనకు గురైంది. గంగూభాయ్‌ని స్వయంగా వేశ్యవాటికలో 500 రూపాయలకు అమ్మి వేయడంతో వేశ్యగా మారుతుంది.

  మాఫియా డాన్ అనుచరుడి చేతిలో

  మాఫియా డాన్ అనుచరుడి చేతిలో

  అందంతో ఆకట్టుకొనే విధంగా ఉన్న గంగూభాయ్‌కి వేశ్యవాటికలోనే చేదు అనుభవం తప్పలేదు. గ్యాంగస్టర్ కరీం లాలా గ్యాంగ్‌కు చెందిన సభ్యుడు గంగూభాయ్‌ని రేప్ చేయడం జరుగుతుంది. తనపై రేప్‌ చేసిన మాఫియా సభ్యుడిపై పోరాటం చేస్తూ... కరీం లాలాను న్యాయం చేయాలని నిలదీస్తుంది. ఆ సమయంలో గంగూభాయ్‌ని తన సోదరిగా చేసుకొని కరీం లాలా రాఖీ కట్టి న్యాయం చేస్తాడు.

  వేశ్యవృత్తిలో ఆదర్శమూర్తిగా

  వేశ్యవృత్తిలో ఆదర్శమూర్తిగా

  వేశ్య వృత్తిలో కొనసాగిన గంగూభాయ్ ఆ వ్యాపారంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. ముంబైలోని హెరా మండీ రెడ్ లైట్ ఏరియాలో ఎంతో మంది మహిళలకు అండగా నిలుస్తుంది. వేశ్యవృత్తిలో ప్రవేశించే ప్రతీ మహిళను అడిగి వారికి ఇష్టం లేకుంటే బలవంతంగా అందులోకి రానివ్వకుండా చర్యలు తీసుకొనే వారట. అందుకే ఇప్పటికీ గంగూభాయ్ ఫోటో ముంబై రెడ్ లైట్ ఏరియాలోని ప్రతీ ఇంటిలో ఉంటుందట.

  ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ పుస్తకం ఆధారంగా

  ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ పుస్తకం ఆధారంగా

  ముంబైలోని రెడ్‌లైట్ ఏరియాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా గంగూభాయ్ కతియావాడి చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్నారు. ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా రూపొందుతున్నది.

  ఆలియాభట్ కెరీర్ ఇలా..

  ఆలియాభట్ కెరీర్ ఇలా..

  ఆలియాభట్ కెరీర్ విషయానికి వస్తే.. సడక్ 2 లాంటి డిజాస్టర్ తర్వాత తన కెరీర్‌ను చక్కదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో RRR, హిందీలో బ్రహ్మస్త్ర, అలాగే గంగూభాయ్ కతియావాడి చిత్రాల్లో నటిస్తున్నారు.

  English summary
  Bollywood actress Alia Bhatt is doing a prostitute role in Gangubai Kathiawadi movie which is directed by Sanjay Leela Bhansali. This teaser released on Sanjay's birthday. it goes viral on social media. This movie based on a book written by Hussain Zaidi titled 'Mafia Queens of Mumbai'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X