అలియాభట్ మరోసారి మెరిసింది.. 100 కోట్ల కబ్‌లో రాజీ!

By Rajababu

బాలీవుడ్‌లో అలియాభట్ మరోసారి సత్తా చాటింది. తాను నటించిన రాజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్నది. చిన్న చిత్రంగా రిలీజై భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. భారతీయ ప్రభుత్వానికి గూఢచారిగా వ్యవహరించిన ఓ అమ్మాయి పాత్ర నేపథ్యంగా ఈ చిత్రం రూపొందింది. మేఘనా గుల్జార్ దర్వకత్వం వహించిన రాజీ చిత్రంలోని పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది.

వంద కోట్ల దిశగా రాజీ

వంద కోట్ల దిశగా రాజీ

విడుదలై మూడో వారం అవుతున్నప్పటికీ రాజీ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. మూడో శనివారం కూడా రూ.4.20 కోట్ల వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా రూ.98.08 కోట్ల వసూళ్లను సాధించింది. ఇదే ఊపును కొనసాగిస్తే వచ్చే రెండు, మూడు రోజుల్లో రాజీ చిత్రం రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించే అవకాశం లేకపోలేదు.

మరోసారి వంద కోట్ల క్లబ్‌లో ఆలియా భట్

మరోసారి వంద కోట్ల క్లబ్‌లో ఆలియా భట్

హీరోయిన్‌ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిన రాజీ చిత్రం అందాల తార అలియాభట్ కెరీర్‌లోనే అద్భుత చిత్రంగా నిలిచింది. సోలోగా ఇప్పటికే రెండు, మూడుసార్లు రూ.100 కోట్ల క్లబ్ చేరిన ఆలియా.. మరోసారి తన చిత్రాన్ని ఆ క్లబ్‌లో చేరేందుకు దోహదపడ్డారు.

 సెన్సేషనల్ సినిమాతో మేఘన గుల్జార్

సెన్సేషనల్ సినిమాతో మేఘన గుల్జార్

తల్వార్ చిత్రం తర్వాత మేఘన గుల్జార్ మరో సెన్సేషనల్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జంగ్లీ పిక్చర్స్, ధర్మ ప్రొడక్షన్స్ రూపొందించిన ఈ చిత్రంలో రజిత్ కపూర్, సోని రజ్దాన్, జైదీప్ ఆహ్లవాత్ కీలక పాత్రలను పోషించారు.

భారత్ గొప్పతనాన్ని చూపించాను

భారత్ గొప్పతనాన్ని చూపించాను

రాజీ చిత్ర విజయంపై దర్శకురాలు మేఘనా గుల్జార్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌ను చెడుగా చూపించడం నాకు ఇష్టం లేదు. కానీ అదే సమయంలో భారత్‌ గొప్పతనాన్ని చూపించాలని ప్రయత్నం చేశాను అని మేఘన పేర్కొన్నారు. మేఘనా గుల్జార్ ప్రముఖ సినీ కవి, దర్శకుడు గుల్జార్‌కు కుమార్తె అనే విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X