అవుంటే చాలు జీవితమే మారిపోతుందంటోన్న ఆలియా

కపూర్ ల ఇంట చోటుచేసుకున్న విషాదం నుంచి ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. రిషీ కపూర్ మరణాంతరం, ధుఖః సాగరంలో మునిగిపోయిన కుటుంబానికి ఆలియా వెన్నుదన్నుగా నిలిచిన వైనం తెలిసిందే. నీతూ కపూర్ కు, రణ్ బీర్ కపూర్ కు గొప్ప ఆసరాగా మారిన ఆలియా, ఇప్పటి నుంచే ఇంటి బాధ్యతలను భుజానికెత్తుకుందని తెలుస్తోంది. ఆమె ఇన్స్టా పోస్ట్ ల ద్వారా ఈ విషయం అర్ధమవుతోంది.

 మనుషులే కాదు శునకాలకూ అమే ఆసరా

మనుషులే కాదు శునకాలకూ అమే ఆసరా

ప్రస్తుతానికి షూటింగ్ లు ఏమీ లేకపోవడంతో వీలైనంత ఎక్కువ సమయం రణ్ బీర్ తోనే గడుపుతున్న ఆలియా, ఇంటిల్లపాదికీ కూడా రిలీఫ్ మంత్రాన్ని బోధిస్తోంది. అత్త నీతూ కపూర్ , ఆడపడుచు రిథిమా కపూర్ తో కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంట్లోని అతి ముఖ్యమైన వ్యక్తులు అమ్మడికి అల్లుకుపోయారని వినికిడి.

రణ్ బీర్ పిల్లలకు అన్నీ తానైన ఆలియా

రణ్ బీర్ పిల్లలకు అన్నీ తానైన ఆలియా

రణ్ బీర్ కు కుక్కలంటే విపరీతమైన ఇష్టం. తాను స్వయంగా లియోనెల్, లిడో అనే రెండు కుక్కలను పెంచుకుంటున్నాడు. వాటితో రణ్ బీర్ కు గాఢమైన అనుబంధం పెనవేసుకుంది. ఇక త్వరలో ఆ ఇంట కోడలిగా అడుగుపెట్టబోతున్న ఆలియా ఇంటి జనాలతో పాటూ, శునకాలను కూడా మచ్చిక చేసుకుంది. వాటికీ అవసరమైన ప్రేమను పంచిపెడుతోంది.

వైరల్ గా మారిన ఫొటోలు

వైరల్ గా మారిన ఫొటోలు

ఈ మధ్య రణ్ బీర్ శునకాలతో పలు ఫొటోలు దిగిన ఆలియా, వాటిని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ఎప్పటిలాగనే ఈ ఫొటోలు కూడా నిమిషాల వ్యవధిలోనే వైరల్ గా మారాయి. ముఖ్యంగా, ఆలియాతో పాటూ ఉన్న శునకాలు కూడా ఫ్యాన్స్ దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

 చేతినిండా సినిమాలే సినిమాలు

చేతినిండా సినిమాలే సినిమాలు

ప్రస్తుతానికి షూటింగ్ లు లేకపోవడంతో ఖాళీగా ఉన్నప్పటికీ ఆలియా చేతిలో పలు ఆసక్తికరమైన సినిమాలే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో గంగూభాయ్ కాథియావాడీ అనే సినిమాతో పాటూ, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బ్రహ్మాస్త్రలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. ఇక తెలుగులో రాజమౌళి ఆర్ఆర్ఆర్ లోనూ అమ్మడే హీరోయిన్ కాగా, తండ్రి మహేశ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సడక్ 2లోనూ ఆలియా కనిపించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X