రూ.1 కోటి కోసం పాకిస్థాన్ వెళ్లి బుక్కయ్యాడు: ఆ సింగర్‌పై ఆలిండియా సినీ వర్కర్స్ నిషేధం

Recommended Video

Mika Singh Banned By All India Cine Workers Association || Filmibeat Telugu

ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్‌పై నిషేధం విధించడంతో పాటు అతడిని బాయ్‌కాట్ చేస్తూ ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్(ఏఐసిడబ్ల్యుఏ) నిర్ణయం తీసుకుంది. మికా సింగ్ పాకిస్తాన్‌లోని ఓ పెళ్లి వేడుకలో ప్రదర్శన ఇవ్వడమే ఇందుకు కారణం. ఈ మేరకు ఏఐసిడబ్ల్యుఏ ఓ స్టేట్మెంట్ విడుదలైంది.

ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ మికా సింగ్... కరాచిలోని పర్వేజ్ ముషారఫ్ బంధువు పెళ్లి వేడుకలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీంతో ఏఐసిడబ్ల్యుఏ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

అతడితో ఎవరైనా పని చేస్తే అంతే...

అతడితో ఎవరైనా పని చేస్తే అంతే...

మికా సింగ్‌తో ఇండియాలోని సినీ నిర్మాణ సంస్థలు, మ్యూజిక్ కంపెనీలు, ఆన్ లైన్ మ్యూజిక్ కంటెంట్ ప్రొవైడర్స్ పని చేయకూడదు అని ఏఐసిడబ్ల్యుఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎవరైనా అతడితో పని చేస్తే లీగల్ సీక్వెన్సెన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఏఐసిడబ్ల్యుఏ అధ్యక్షుడు సురేష్ గుప్తా తెలిపారు.

ఆవేవీ నీకు పట్టవా? మికా సింగ్..

ఆవేవీ నీకు పట్టవా? మికా సింగ్..

ఓ వైపు ఇండియా, పాకిస్థాన్ మధ్య(కశ్మీర్‌లోఆర్టికల్ 370 రద్దు కారణంగా) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ ఇప్పటికే ఇండియన్ సినిమాల మీద నిషేధం విధించింది. కానీ మికా సింగ్ ఇవేమీ పట్టించుకోకుండా డబ్బు సంపాదనకే ప్రాధాన్యత ఇచ్చాడని ఏఐసిడబ్ల్యుఏ వ్యాఖ్యానించింది.

పాకిస్థాన్లో రూ. 1 కోటి పారితోషికం

పాకిస్థాన్లో రూ. 1 కోటి పారితోషికం

కాగా... పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కజిన్ కూతురు పెళ్లి వేడుకలో మికా సింగ్ తన 14 మంది సిబ్బందితో కలిసి ప్రదర్శన ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకుగాను మికా సింగ్ దాదాపు లక్ష యాభైవేల అమెరికన్ డాలర్లు(రూ. 1 కోటి) రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.

మికా సింగ్ మీద విమర్శలు

మికా సింగ్ మీద విమర్శలు

ఓ వైపు పాకిస్థాన్.. ఇండియన్ నిమాలపై బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవేమీ పట్టించుకోకుండా మికా సింగ్ ప్రదర్శన ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అతడిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X