యష్‌పై నోరుపారేసుకొన్న బాలీవుడ్ హీరో.. అల్లు అర్జున్‌ను వదలకుండా కామెంట్స్!

ఉత్తరాది సినిమా ఇండస్ట్రీ, దక్షిణాది సినిమా ఇండస్ట్రీ అంటూ అప్పుడు విభేదాలు సృష్టించడానికి కొందరు బాలీవుడ్ సినీ ప్రముఖులు నోరుపారేసుకొంటారు. తెలుగు, దక్షిణాది హీరోలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారు వివాదాలు సృష్టిస్తుంటారు. తాజాగా హిందీ నటుడు అర్షద్ వార్సీ ప్రభాస్‌పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం సృష్టించాయి. అయితే తాజాగా ఆయన యష్, అల్లు అర్జున్‌పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం మరో చర్చకు దారి తీసింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఇటీవల ముంబైకి చెందిన ప్రాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీ మాట్లాడుతూ..కల్కి సినిమాలో ప్రభాస్ జోకర్‌గా కనిపించారు. కమెడియన్ మాదిరిగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంది. ప్రభాస్ లాంటి హీరో అలాంటి పాత్రలు చేయడమా? అంటూ అన్నారు. దాంతో నెటిజన్లు భారీగా స్పందించారు. ప్రభాస్ ఫ్యాన్స్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

Allu Arjun and Yash targeted by Bollywood Actor Arshad Warsi Here is the full Report

ఇదే ఇంటర్వ్యూలో అల్లు అర్జున్, యష్ గురించి మరోసారి నోరు పారేసుకొనే ప్రయత్నం చేశాడు. వారిద్దరి స్వాగ్ గురించి ఎగతాళి చేస్తూ కామెంట్స్ చేశారు. దాంతో నెటిజన్ల మరోసారి అర్షద్ వార్సీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే వారిద్దరిపై ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ప్రభాస్‌తో పోల్చుకొంటే సాఫ్ట్‌గానే ఉన్నాయి.

ఇక యష్ గురించి మాట్లాడుతూ.. స్వాగ్, స్టైల్ తగ్గించుకొంటే మంచింది అని అర్షద్ వార్సీ అంటే.. గడ్డం కూడా తగ్గించుకోవాలేమో అని యాంకర్ అనడం కనిపించింది. దాంతో సౌత్ ఇండస్ట్రీ వాళ్లపై బాలీవుడ్ యాక్టర్లకు ఉండే చిన్నచూపు స్పష్టంగా కనిపించింది. ఒకరి స్వాగ్ గురించి కామెంట్స్ చేయడం తప్పని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Allu Arjun and Yash targeted by Bollywood Actor Arshad Warsi Here is the full Report

ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. కూల్.. కానీ స్వాగ్, స్టైల్ కాస్త తక్కువగానే చూపిస్తాడు. కానీ స్టయిలీష్‌గా కనిపిస్తాడు. అతను కూల్ బాయ్ అంటూ కామెంట్ చేశాడు. అయితే ఐకాన్ స్టార్‌పై కొంత సాఫ్ట్‌గా వ్యవహరించడంపై అల్లు ఫ్యాన్స్ ఫీల్‌గుడ్ కామెంట్స్ చేస్తున్నారు.

అర్షద్ వార్సీ కెరీర్ విషయానికి వస్తే.. అనిల్ కపూర్, శ్రీదేవీ నటించిన రూప్ కీ రాణి, చోరోంకా రాజా సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ నిర్మించిన తెరె మేరే సప్నే చిత్రంతో హీరోగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత హీరోగా సెటిల్ కాకపోవడంతో.. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహే మున్నాభాయ్ లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్గుగా మంచి పేరు సంపాదించుకొన్నారు.

More from Filmibeat

Read more about: allu arjun yash arshad warsi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X