Pushpa 2: బాలీవుడ్ ను భయపెడుతున్న బన్నీ.. పుష్ప 2 వైల్డ్ ఫైర్ కు త‌ప్పుకున్న స్టార్ హీరో..

Pushpa 2 vs Chhava: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కోసం వరల్డ్ వైడ్ గా కోట్లాదిమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఆరు భాషలలో విడుదల కానుంది. భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఈ మూవీ విడుదల కాకముందే.. ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తుంది. దీంతో పుష్ప రాజ్ వైల్డ్ ఫైర్ కు బాలీవుడ్ సైతం భయపడుతుంది. పుష్ప 2 తో పోటీ పడలేక సైడ్ అయిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ?

ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్‌ ప్రతినాయకుడు పాత్రలో కనిపించనున్నారు. ఇక సునీల్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ్, అజయ్ తదితరులు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. పాన్ ఇండియా సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Allu Arjun Pushpa 2 Effect in Bollywood vicky kaushal movie chaava release in February to avoid clash with pushpa 2

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్,స్ టీజర్, ఐటెం సాంగ్ కు ఎనలేని ఆదరణ లభిస్తుంది. మెయిన్ గా పుష్ప 2 నుండి విడుదలైన టీజర్ కు నెట్టింట్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. అలాగే సుకుమార్- బన్నీ కాంబినేషన్లో వస్తున్న ఐటమ్ సాంగ్ లో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల తన మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. ఈ సాంగ్ కూడా మాస్ ఆడియన్స్ నుంచి మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఐటమ్ సాంగ్ కూడా యూట్యూబ్లో ట్రెండింగ్ గా మారింది.

ఇక పుష్ప 2 విడుదలకు ముందే 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం తో ఈ మూవీపై నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు పెరిగాయి.
దీంతో డిసెంబర్ మొదటి వారం, రెండో వారంలో విడుదల కానున్న సినిమాలన్నీ సైడ్ అయిపోయాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన 'చావా' సినిమా కూడా సైడ్ అయిపోయింది. ఈ సినిమా మరాఠా రాజు శంబాజీ జీవితం ఆధారంగా తెరకెక్కించారు . ఈ సినిమాలో విక్కీ కౌశల్ శంబాజీ పాత్రలో నటించారు, ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా .. మడక్ ఫిలిం పతాకంపై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు.

Allu Arjun Pushpa 2 Effect in Bollywood vicky kaushal movie chaava release in February to avoid clash with pushpa 2

మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తోంది. అలాగే అక్షయ్ కన్నా ప్రధాన పాత్రలో నటించుతున్నారు. అయితే ఈ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, సడన్ గా అల్లు అర్జున్ పుష్ప2 బరిలోకి దిగడంతో చావా మూవీ మేకర్స్ కాస్త సందిగ్ధంలో పడ్డారు. పుష్ప 2ను ప్రపంచ వ్యాప్తంగా 11500 థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే అదే టైమ్‌లో మరో భారీ సినిమాకు థియేటర్ల దొరకటం చాలా కష్టం. అనవసరంగా పుష్ప 2 తో పోటీపడి.. దెబ్బ తినడం కంటే సైడ్ అయిపోయింది మేలని భావించారు.

దీంతో చావా మూవీ విడుదలను వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. చావా మూవీని ఫిబ్రవరి 14 విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి లో విడుదల చేయడానికి మరో కారణం కూడా ఉంది. ఫిబ్రవరిలో చత్రపతి మహారాజ్ జయంతి కాబట్టి ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందని ఈ మూవీని ఫిబ్రవరి కి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పుష్ప 2తో పోటీ పడలేక తప్పుకున్నారని బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్పరాజ్‌ రేంజ్‌ అంటూ సంబరపడిపోతున్నారు.

More from Filmibeat

Read more about: vicky kaushal chaava allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X