అజయ్ దేవగన్, రకుల్ మూవీలో... రేప్ నిందితుడు, బహిష్కరిస్తామని హెచ్చరిక!

అజయ్ దేవగన్ నటించిన 'దే దే ప్యార్ దే' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ ట్రైలర్లో ఓ నటుడు కనిపించడంతో నెటినట్లు ఆగ్రహావేశాలకు గురయ్యారు. అలాంటి వ్యక్తిని ఎందుకు మీ సినిమాలో తీసుకున్నారు? అంటూ విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.

ఆ యాక్టర్ మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్. మీటూ ఉద్యమంలో ఇతడిపై రేప్ ఆరోపణలు వెల్లువెత్తాయి. వింటా నంద అనే రచయిత.. నిర్మాత అలోక్ నాథ్ తనపై అత్యచారం చేసినట్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

19 ఏళ్ల క్రితం సంఘటన

19 ఏళ్ల క్రితం సంఘటన

అలోక్ నాథ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, 19 ఏళ్ల క్రితం ఈ సంఘటన జరిగినపుడు దీని గురించి నా స్నేహితులకు చెబితే అతడు పెద్ద యాక్టర్, కంప్లయింట్ చేస్తే నీ కెరీర్ నాశనం అవుతుంది అని నన్ను భయ పెట్టారు. అందుకే అపుడు అతడిపై ఫిర్యాదు చేయలేక పోయాను. మీటూ ఉద్యమం కారణంగా ఇన్నాళ్లకు ఈ విషయం బయటపెట్టే అవకాశం వచ్చింది అని బాధితురాలు వింటా నంద ఆరోపించిన సంగతి తెలిసిందే.

ప్రజల నుంచి డిమాండ్

ప్రజల నుంచి డిమాండ్

ఈ వివాదం కారణంగా అలోక్‌నాథ్ మెంబర్‌షిప్ కూడా సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రద్దు చేశారు. అయితే ఇప్పటి వరకైతే అలోక్‌ నాథ్ మీద ఆరోపణలు రుజువు కాలేదు. సాధారణ ప్రజలు, ప్రేక్షకుల నుంచి అలోక్ నాథ్ లాంటి వ్యక్తులను సినిమాల్లోకి తీసుకోవద్దనే డిమాండ్ వినిపిస్తూనే ఉంది.

అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్స్

అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్స్

రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్‌నాథ్‌ను ‘దే దే ప్యార్ దే' సినిమాలో తీసుకోవడంపై ఇటు హీరో అజయ్ దేవగన్‌, అటు నిర్మాత భూషణ్ కుమార్ మీద విమర్శలు వర్షం కురుస్తోంది. మీటూ ట్యాగ్‌తో ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో తమ అసంతృప్తి చేస్తూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదా?

మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదా?

ఎంతో మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్ నాథ్ లాంటి వ్యక్తులను మీ సినిమాలో తీసుకోవడం వల్ల మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? మహిళలను లైంగికంగా వేధించే వారిని సెట్స్‌లోకి రానివ్వకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదా? అంటూ ఫైర్ అవుతున్నారు.

అజయ్ దేవగన్ రియాక్షన్

అజయ్ దేవగన్ రియాక్షన్

‘దే దే ప్యార్ దే' ట్రైలర్ లాంచ్ ఈవెంటులో అలోక్ నాథ్ గురించి ప్రశ్న ఎదువ్వగా అజయ్ దేవగన్ స్పందిస్తూ... అలోక్ నాథ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడానికి ముందే అతడి షూటింగ్ పూర్తయిందని తెలిపారు. ఈ అంశం గురించి తాను ఇక్కడ మాట్లాడ దలుచుకోలేదని, దానికి ఇది సరైన వేదిక కాదని మీడియాకు సూచించారు.

సినిమాను బహిష్కరిస్తామని హెచ్చరిక

సినిమాను బహిష్కరిస్తామని హెచ్చరిక

అలోక్ నాథ్ విషయంలో అజయ్ దేవగన్ ఇచ్చిన సమాధానంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలోక్ నాథ్ సినిమాలో ఉంటే సినిమాను బహిష్కరిస్తామని కొందరు హెచ్చరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X