పెద్దలకు మాత్రమే: ‘త్రిబుల్ ఎక్స్ అన్ సెన్సార్డ్’ ట్రైలర్
Recommended Video

ఏఎల్‌టి బాలాజీ సంస్థ నుండి మరో ఎరోటిక్ వెబ్ సిరీస్ రాబోతోంది. త్రిబుల్ ఎక్స్(XXX) పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ఇండియాలో రూపొందుతున్న తొలి యూత్ ఎరోటికాగా పేర్కొంటున్నారు. తాజాగా ఈ ట్రైలర్ కూడా విడుదల చేశారు. సీన్లను బోల్డ్‌గా తెరకెక్కించిన విధానం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ వెబ్ సిరీస్‌కు కెన్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హిందీ టీవీ రంగంలో పాపులర్ స్టార్లుగా పేరు తెచ్చుకున్న రిథ్విక్ ధంజాని, శంతను మహేశ్వరి, అంకిత్ గేరా తదితరులు నటిస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఆసక్తికరంగా ఉంటుందని, యువతకు తప్పకుండా నచ్చుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కేవలం యూత్‌ను టార్గెట్ చేసుకుని దీన్ని నిర్మించడం గమనార్హం. ట్రైలర్లో కూడా ఇది పెద్దలకు మాత్రమే చూడదగినది, 20 సంవత్సరాలలోపు వారు దీనికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

ముంబైలోని ఓ నైట్ క్లబ్‌లో ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శంతను మహేశ్వరి, రిథ్విక్ ధంజాని, అపర్ణ శర్మ, అపర్ణ బాజ్‌పాయ్, అడర్ మల్లిక్, ఫ్లోరా షైనీ తదితరులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











