twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను కూడా బాధితుడినే అంటోన్న చోటా నవాబ్.. విడ్డూరం అంటే ఇదేనంటోన్న నెటిజెన్స్

    |

    బాలీవుడ్ లో ఇప్పుడు బంధుప్రీతి అన్న మాటపై ఎడతెగని చర్చ నడుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అనంతరం నెపోటిజంపై ఓ ఉద్యమమే ఉవ్వెత్తున లేచిందని చెప్పుకోవచ్చు. రావణకాష్టంలా రగులుతున్న ఈ ఉద్యమం రోజుకో మలుపు తిరుగుతోంది. బంధుప్రీతి ద్వారా లబ్ధిపొందిన నటీనటులు వీలైనంతగా సైలెంట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, బాలీవుడ్ చోటా నవాబ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు.

    అలనాటి అందాల నటి షర్మిలా టాగోర్ తనయుడు, ప్రస్తుతం నవయవ్వన అందలతో కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న సారా అలీ ఖాన్ తండ్రి అయిన సైఫ్, నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. బంధుప్రీతికి నిలువెత్తు ఉదాహరణగా సైఫ్ గురించి చెప్పుకోవచ్చు. అయినా సరే తాను కూడా బంధుప్రీతి బాధితుడినే అంటున్నాడు ఈ చోటా నవాబ్.

    Am a victim of Nepotism - Saif Ali Khan

    స్టార్ కిడ్ గా తనకు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన హోదా ఉన్నప్పటికీ, తాను కూడా బంధు ప్రీతి వల్ల అవకాశాలకు కటకటలాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు సైఫ్. దీంతో అవాక్కవ్వడం ఇండస్ట్రీ జనాల వంతైంది. ఇక అక్కడితో ఆగకుండా, సుశాంత్ మరణంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై దుమ్మెత్తిపోశాడు.

    ఇన్నాళ్లూ వీరంతా ఏమైపోయారని ప్రశ్నించాడు. వీరందరూ సుశాంత్ మరణం ద్వారా లభ్దిపొందాలని చూస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించాడు. నిజానికి ఇండస్ట్రీలో ఎవరూ ఎవరినీ పట్టించుకోరని, ఇప్పుడు ఓదార్పు యాత్ర చేపట్టిన వారందరూ బూటకపు ప్రేమ నటిస్తున్నారని స్పష్టం చేశాడు.

    English summary
    Saif Ali Khan opens about Nepotism, Says that he been a victim of Nepotism in his career at somepoint of time, And criticises Hypocrytic people who are crying fowl on Sushanth's suicide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X