అంబానీ ఇన్విటేషన్: గణేష్ చతుర్థిలో సందడి చేయనున్న సినీ తారలు
ఫెస్టివల్ సీజన్ వస్తే చాలు అంబానీల నివాసం సినీ తారలతో సందడిగా కనిపిస్తుంది. భారత కుభేరుడు, రియలన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ముందు నుంచీ సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులతో మంచి రిలేషన్ కొనసాగిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇటీవల వైభవంగా జరిగిన అంబానీ కుమారుడు, కూతురు వివాహంలో బాలీవుడ్ అగ్రతారలు సందడి చేసిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 2న గణేష్ చతుర్థి సందర్భంగా అంబానీ కుటుంబం భారీ వేడుక జరిపేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు ఇన్విటేషన్లు కూడా సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఇవి పలువురు బాలీవుడ్ ప్రముఖులకు అందినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి 8 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది.

ఇషా-ఆనంద్, శ్లోక-అనంత్ వివాహం తర్వాత జరుగుతున్న తొలి గణేష్ చతుర్థి వేడుక. అందుకే దీన్ని మరింత ఘనంగా నిర్వహించేందుకు అంబానీ ఫ్యామిలీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆ రోజు ముంబైలో ఉండే సినీ ప్రముఖులంతా ఈ వేడుకు హాజరవుతారని తెలుస్తోంది.
గతేడాది జరిగిన ఇషా, ఆనంద్ వివాహానికి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్ బచ్చన్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, అమీర్ ఖాన్, కిరణ్ రావు తదితరులు హాజరైన సందడి చేసిన సంగతి తెలిసిందే. గణేష్ చతుర్థి వేడుకలో ఈ బాలీవుడ్ ప్రముఖులంతా తప్పకుండా భాగం అవుతారని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











