సల్మాన్‌ఖాన్‌తో పిల్లలను కంటా .. 50 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ సూపర్‌స్టార్‌లలో ఒకరిగా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు సల్మాన్ ఖాన్. 60 ఏళ్ల వయసొచ్చిన ఇంకా మోస్ట్ బ్యాచిలర్‌గా ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నాడు ఈ కండలవీరుడు. హీరోగా కెరీర్ మొదలెట్టిన నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోయిన్లతో ఎఫైర్ నడిపించాడు సల్మాన్. ఆయనతో ప్రేమాయణం సాగించిన ముద్దుగుమ్మలంతా స్టార్ హీరోయిన్లే కావడం గమనార్హం. తాజాగా సల్మాన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది ఓ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.
90లలో టాలీవుడ్, బాలీవుడ్‌లను ఒక ఊపారు అమీషా పటేల్. తేనే కళ్లతో , మెరుపు తీగ వంటి అందంతో నాటి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. అమీషా పటేల్ నటించిన సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. 50కి చేరువ అవుతున్నా ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో కుర్ర హీరోయిన్లను మించి మెరిసిపోతున్న అమీషా పటేల్ భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ నటిగా ఉన్నారు.

9 జూన్ 1975న ముంబైలో పుట్టి పెరిగారు అమీషా పటేల్. తల్లిదండ్రులు అమిత్ పటేల్, ఆశ. ఈమెకు అష్మిత్ పటేల్ అనే సోదరుడు ఉన్నాడు. ఐదేళ్ల వయసులోనే భరత నాట్యంలో ప్రావీణ్యత సంపాదించిన అమీషా.. ముంబైలో ప్రాథమిక విద్యను అభ్యసించగా అమెరికా బయో జెనెటిక్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన అమీషా.. తొలుత ఉద్యోగంలో చేరి కెరీర్‌లో స్థిరపడాలని భావించిన ఆమె ఎకనమిక్ అనలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు.
ఈ దశలో సినీ రంగం వైపు అడుగులు వేసిన అమీషా పటేల్.. 2000వ సంవత్సరంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన కహో నా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్ - పూరీ జగన్నాథ్‌ల కాంబోలో వచ్చిన బద్రీతో తెలుగు వారిని పలకరించారు . అలా తెలుగు, హిందీలలో సినిమాలు చేస్తూ వచ్చిన అమీషా పటేల్‌కు తర్వాతి కాలంలో అవకాశాలు తగ్గాయి. ఈ దశలో గదర్ 2 బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది షాకిచ్చింది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అమీషా పటేల్.. ఇటీవల ట్విట్టర్‌లో లైవ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సల్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుని అందమైన పిల్లల్ని కనండి అని ప్రశ్నించాడు. దీనికి అమీషా స్పందిస్తూ.. అందమైన వ్యక్తులు కలిసి ఉండటాన్ని ప్రపంచం ఇష్టపడుతుందని అన్నారు. అభిమానితో జరిగిన ఈ సంభాషణను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమీషా పటేల్ పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గతంలో సల్మాన్ - అమీషాలు యే హై జల్వాలో జంటగా నటించారు.


Click it and Unblock the Notifications











