అమీషా పటేల్ 2.5 కోట్ల చీటింగ్.. ఘాటుగా స్పందించిన పవన్ కల్యాణ్ హీరోయిన్!
బాలీవుడ్ తార అమీషా పటేల్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నిర్మాతను చీటింగ్ చేశారనే వివాదం ఇంకా కొనసాగుతున్నది. అయితే బిజినెస్‌మ్యాన్‌ను మోసగించినట్టు వచ్చిన వార్తలపై అమీషా పటేల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అయితే ఈ వివాదంపై ఏమని అమీషా పటేల్ స్పందించారంటే..

బాలీవుడ్‌లో గ్రాండ్‌గా
అమీషా పటేల్ కెరీర్ బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. హృతిక్ రోషన్ హీరోగా పరిచయం అవుతూ రూపొందిన కల్ హో నా హో అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో పవన్ కల్యాణ్‌తో బద్రీ చిత్రంలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.
ట్రెడిషినల్ ప్లస్ గ్లామరస్ లుక్స్ తో డోస్ పెంచిన రత్తాలు

పవన్ కల్యాణ్‌తో నటించిన తర్వాత
పవర్ స్టార్‌తో కలిసి బద్రీలో నటించిన తర్వాత తెలుగులో చాలా అవకాశాలే వచ్చాయి. ఎన్టీఆర్‌తో నరసింహుడు చిత్రంలో కూడా నటించింది. దక్షిణాదిలో గ్లామర్ తారగా ఆకట్టుకొన్నది. అయితే బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో అటువైపు దృష్టి పెట్టింది.

ఒడిదుడుకుల్లో అమీషా పటేల్ కెరీర్
బాలీవుడ్లో కూడా అమీషా పటేల్ కెరీర్ ఒడిదుడుకులకు లోనైంది. దాంతో స్వయంగా ఆమె నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. దేశీ మ్యాజిక్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నించింది. అజయ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు ఫైనాన్సియర్‌గా వ్యవహరించారు. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయి విడుదలకు నోచుకోలేకపోవడంతో వివాదంగా మారింది.

2.5 కోట్ల పెట్టుబడిని ఇవ్వకుండా
దేశీ మ్యాజిక్ సినిమాకు పెట్టిన 2.5 కోట్ల పెట్టుబడిని ఇవ్వకుండా చీటింగ్ చేసిందంటూ అజయ్ కుమార్ సింగ్ జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ట్విట్టర్‌లో ఘాటుగా అమీషా
అమీషా పటేల్‌పై దాఖలైన కేసు కోర్టులో కొనసాగుతుండగానే ఆమెపై మళ్లీ రూమర్లు చెలరేగాయి. పాత వివాదాన్ని లక్ష్యంగా చేసుకొని తన ప్రొఫెషనల్ జీవితం, పర్సనల్ లైఫ్‌పై రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. గత వివాదాన్ని మళ్లీ తోడుతున్నారు. మీ జీవితం ఇలానే ఎంజాయ్ చేసుకోండి అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











