Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వైరల్ అవుతున్న లేడీ సింగర్ ఫోటోస్.. బిత్తరపోతున్న అనుష్క ఫ్యాన్స్
ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. బాలీవుడ్ నటి అనుష్క శర్మను పోలిన మరో వ్యక్తి ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైర్ అవుతోంది. ఆమె కూడా ఎంటర్టెన్మెంట్ రంగానికి అమ్మాయే కావడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.
అమెరికన్ సింగర్ జులియా మైకేల్స్ ఇటీవల తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తర్వాత ఆ పిక్స్ చూసిన ఇండియన్ ఫ్యాన్స్... ముఖ్యంగా అనుష్క, కోహ్లి అభిమానులు బిత్తరపోయారు. ఒక జుట్టు రంగు మినహా ఆమె అనుష్కకు జిరాక్స్ కాపీలా ఉండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
ఇండియన్ మీడియాలో హాట్ టాపిక్
తన భర్త విరాట్ కోహ్లితో కలిసి లాంగ్ హాలిడే ఎంజాయ్ చేసి ఇటీవలే ఇండియా తిరిగి వచ్చిన అనుష్క శర్మ... తనను పోలిన వ్యక్తి మరొకరు ఉన్నారనే వార్తలతో ఇండియన్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఈ ఫోటో చూసి అనుష్క సైతం ఆశ్చర్య పోయారట.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్
అనుష్క, విరాట్ కోహ్లి అభిమానులు సోషల్ మీడియాలో జులియా మైకేల్స్, అనుష్క ఫోటోలు పోస్ట్ చేస్తూ ఇద్దరి మధ్య కంపేరిజన్స్ వివరిస్తూ కామెంట్స్ చేస్తుండటం, కొందరైతే అనుష్క కంటే... జులియా మైకేల్స్ చాలా అందంగా ఉందని పేర్కొనడం గమనార్హం.
|
వైట్ వెర్షన్ ఆఫ్ అనుష్క
కొందరైతే ఓ అడుగు ముందుకేసి... జులియా మైకేల్స్ వైట్ వెర్షన్ ఆఫ్ అనష్క అంటూ వింత కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అనుష్కను పోలిన మరో వ్యక్తి... ఆమె కూడా ఎంటర్టెన్మెంట్ రంగంలోనే ఉందన్న విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
|
అనుష్క.. జులియా మైకేల్స్ కలుస్తారా?
నుష్క తరచూ సినిమా షూటింగుల నిమిత్తం అమెరికాకు వెళుతూనే ఉంటారు. అచ్చం తనను పోలి ఉన్న జులియా మైకేల్స్ విషయం మీడియాలో హాట్ టాపిక్ కావడంతో అమెరికా వెళ్లినపుడు ఆమెను అనుష్క కలిసే అవకాశం లేకపోలేదు.