ఐశ్వర్య - అభిషేక్ విడాకులు .. అమితాబ్ కుమార్తెకు ఐష్ అంటే పడదా? ఆ ఫోటోతో బయటపడ్డ నిజస్వరూపం

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కడ చూసినా విడాకుల వార్తలే కనిపిస్తున్నాయి. రీసెంట్‌గా దిగ్గజ సంగీత దర్శకుడు , ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భాను నుంచి విడిపోయారు. దాదాపు 29 సంవత్సరాల వైవాహిక బంధానికి వీరిద్దరూ వీడ్కోలు పలికారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు ఎందుకు తీసుకుందో తెలియక చిత్ర పరిశ్రమలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇక వీరి కంటే ముందే బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్‌ల విడాకుల వ్యవహారం ఎప్పటి నుంచో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

కాగా.. ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్‌లు 2007లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు 2011లో ఆరాధ్య పుట్టింది. అయితే ఇటీవలి కాలంలో ఈ జోడీ మధ్య రిలేషన్ దెబ్బతిన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐశ్వర్య - అభిషేక్‌లు విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త ఇప్పటిది కాదు. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్‌ల పెళ్లికి సినీ ప్రముఖులు తమ కుటుంబాలతో సహా తరలివచ్చారు.

Amid divorce rumours Abhishek Bachchan sister Shweta s Gesture For Aishwarya Rai s Sister-In-Law

ఈ పెళ్లికి ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్‌తో కాకుండా కుమార్తె ఆరాధ్యతో అటెండ్ కావడంతో విడాకుల వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అభిషేక్ బచ్చన్ హీనా ఖండేల్వాల్ ఇన్‌స్టాలో పెట్టిన విడాకుల పోస్ట్‌కు లైక్ కొట్టడంతో పుకార్లకు బలం చేకూరినట్లయ్యింది. అలాగే కుమార్తే పుట్టినరోజు వేడుకలకు చిన్న బచ్చన్ దూరంగా ఉండటం మరింత కలకలం రేపింది.

ఆ తర్వాత నటి నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ బచ్చన్ రిలేషన్‌లో ఉన్నారని.. అందుకే ఐష్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లుగా ఇంకొందరు కల్పిత వార్తలు రాస్తున్నారు. తమ వైవాహిక జీవితంపై వస్తున్న వార్తలకు అభిషేక్ బచ్చన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఐశ్వర్య మా కుటుంబం కోసం తన కెరీర్‌ను త్యాగం చేసిందని ప్రశంసించారు. సినిమాల్లో పనిచేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తానని, తనకు నటించేందుకు అనుమతి ఇచ్చినందుకు ఐశ్వర్యురాయ్‌కి అభిషేక్ ధన్యవాదాలు తెలిపారు.

Amid divorce rumours Abhishek Bachchan sister Shweta s Gesture For Aishwarya Rai s Sister-In-Law

సరిగ్గా ఇలాంటి దశలోనే అభిషేక్ సోదరి శ్వేతా బచ్చన్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐశ్వర్యరాయ్ వదిన శ్రీమ రాయ్‌ ఇంటికి ఆమె పూలు పంపారు. అయితే దీనికి కారణం ఏంటనేది ఇంత వరకు తెలియరాలేదు. ఐశ్వర్యకి శ్రీమకు సంబంధాలు అంతగా బాలేదని అంటారు. అలాగే ఐష్‌కి, శ్వేతకు కూడా పడదని బీటౌన్ టాక్. ఇలాంటి వేళ శ్రీమకి శ్వేత ఎందుకు పంపింది అనేది బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరిలో ఎవరో ఒకరు దీనిపై క్లారిటీ ఇస్తే కానీ ఈ ఊహాగానాలకు చెక్ పడదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X