బాలీవుడ్ సినిమా నుంచి విజయ్ సేతుపతిని తప్పించిన స్టార్ హీరో
సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా క్యారెక్టర్ కోసం కొన్నిసార్లు ఫిట్నెస్ విషయంలో మార్పులు చేయక తప్పదు. ఇక కొంతమంది చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ విషయాలలో చాలా సీరియస్ గా ఉంటారు. ఇటీవల విజయ్ సేతుపతి ఆ విషయంలో సరైన న్యాయం చేయలేదని బాలీవుడ్ అగ్ర హీరో తన సినిమా నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మొత్తంలో బెస్ట్ టాలెంటెడ్ నటులలో విజయ్ సేతుపతి టాప్ 10లో ఉంటాడని చెప్పవచ్చు. అయితే అలంటి నటుడు ఇటీవల చెప్పిన పని సరిగ్గా చేయలేదని బాలీవుడ్ అగ్ర హీరో సినిమా నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఆ అగ్ర హీరో మరెవరో కాదు. అమీర్ ఖాన్. ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అమెరికన్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ ఆధారంగా రూపొందుతున్న ఆ సినిమను అద్వైత్ చందన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. అయితే లాక్ డౌన్ షూటింగ్ కారణంగా వాయిదా పడడంతో సినిమా విషయంలో అనేక మార్పులు వచ్చాయి.

హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉంది. దీంతో ఆమె కోసం కాస్ట్లీ VFX ను వాడబోతున్నారట. ఇక విజయ్ సేతుపతి ఒక ముఖ్యమైన పాత్రలో నటించడానికి ఒప్పుకోగా ఆ పాత్ర కోసం సన్నాబడాలని సూచించారట దర్శకుడు. అమీర్ ఖాన్ కూడా తన సినిమాల విషయాలలో సొంత నిర్ణయం కూడా తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తాడు కాబట్టి. ఇక విజయ్ సేతుపతి ఎందుకు లైట్ తీసుకున్నాడో తెలియదు గాని సన్నగా అవ్వలేదట. దీంతో అమీర్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సినిమా నుంచి తప్పించినట్లు టాక్ వస్తోంది. ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియదు గాని విజయ్ అయితే ఆ సినిమాలో నటించడం లేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











