షూటింగ్ కోసం సిద్దమైన అమితాబ్ బచ్చన్.. కరోనా ఎక్కడైతే సోకిందో మళ్ళీ అక్కడే..
కొన్ని వారాల క్రితం బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కరోనా వైరస్ భారిన పడిన విషయం తెలిసిందే. ఆయన భార్య జయబచ్చన్ తప్పితే కొడుకు అభిషేక్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్యలు కూడా కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడటం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే మళ్ళీ బిగ్ బి ఇప్పుడు షూటింగ్స్ కి సిద్ధమవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఏ కారణం వల్ల అయితే కరోనా వచ్చిందో మళ్ళీ అదే పనితో ఆయన బిజీ అయ్యారు.
Recommended Video

77ఏళ్ల అమితాబ్ సాహసమే చేశారు
బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ కి కరోనా సోకింది అనగానే దేశమంతా ఒక్కసారిగా షాక్ కి గురైంది. అసలే పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న 77 ఏళ్ల అమితాబ్ బచ్చన్ కరోనాతో పోరాడడం నిజంగా ఒక సాహసమనే చెప్పాలి. ఏ మాత్రం బేధరకుండా ఆయన నానావతి హాస్పిటల్ లోనే చికిత్స తీసుకోని రెండు వారాల అనంతరం ఆరోగ్యంగా బయటకు వచ్చారు.

కౌన్ బనేగా క్రోర్‌పతి 12వ సీజన్ కోసం
మొత్తానికి రెండు వారాలకుపైగా ట్రీట్మెంట్ తీసుకొని కోలుకొని సెట్టయిన బిగ్ బి ఫ్యామిలీ వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్ళీ అమితాబ్ బచ్చన్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కౌన్ బనేగా క్రోర్‌పతి 12వ సీజన్ కోసం ఆయన రెడీ అవుతున్నట్లు ఇటీవల ట్విట్టట్ ద్వారా వివరణ ఇచ్చారు.

ఆ షో కోసం వెళ్లినపుడే..
మొదట అమితాబ్ బచ్చన్ కి కరోనా సోకింది కౌన్ బనేగా క్రోర్‌పతి ఆడిషన్స్ కోసం వెళ్లినప్పుడేనని బాలీవుడ్ లో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే బిగ్ KBC 12 కోసం నిర్వహకులతో చర్చలు జరుపుతుండగా కరోనా సోకిందని టాక్ కూడా ఎక్కువగా వచ్చింది.

షో చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ
అది ఎంతవరకు నిజమో తెలియదు గాని అమితాబ్ మాత్రం ఇప్పుడు మళ్ళీ KBC 12 షూటింగ్స్ తో బిజీ అయ్యారు. ఈ సారి షో కోసం ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. అసలు షో చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఇచ్చిన కమిట్మెంట్ కి కట్టుబడి అనుకున్న సమయానికి షోని ఫినిష్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. షో నిర్వహకులు కూడా అమితాబ్ రక్షణ విషయంలో మునుపటి కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోనున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











