నా అభిమానుల కోపాన్ని తట్టుకోగలవా.. చచ్చిపోవలని ట్రోల్ చేసిన వారికి అమితాబ్ బచ్చన్ వార్నింగ్!
సోషల్ మీడియాలో కొన్నిసార్లు వచ్చే కామెంట్స్ ఊహించని విదంగా ఉంటాయి. టెక్నాలజీ పెరుగుతుందని సంతోష పడాలా లేక దాన్ని వల్లే అనేక చిక్కులు అని ఇబ్బంది పడాలా అనే సందేహాలు నిత్యం మెదులుతూనే ఉంటాయి. కోట్లాది మంది అభిమానులు అమితాబ్ బచ్చన్ కోలుకోవాలని ఎంతగానో ఆ దేవుడిని కోరుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం సోషల్ మీడియాలో ఆయన చనిపోవాలని కామెంట్స్ చేస్తుండడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. వారికి అమితాబ్ బచ్చన్ అదిరిపోయే కౌంటర్ కూడా ఇచ్చారు.

బిగ్ బి బహిరంగంగ లేఖ
గత రెండు వారాలుగా అమితాబ్ బచ్చన్ ముంబై నానావతి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ భారిన పడిన అమితాబ్ బచ్చన్ ఎప్పటికప్పుడు తన ఆరోగ్యంపై వివరణ ఇస్తున్నారు. రూమర్స్ పై కూడా క్లారిటీగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన ట్రోలింగ్స్ పై బిగ్ బి బహిరంగంగానే లేఖ విడుదల చేశారు.

మీ తండ్రి ఎవరో తెలిసి ఉండదు.
అమితాబ్ బచ్చన్ వివరణ ఇస్తూ.. కనీసం నీ తండ్రి పేరు కూడా చెప్పుకోకుండా అసలు నువ్వు ఎవరో తెలియకుండా నేను చచ్చిపోవలని కోరుకుంటున్నావు. బహుశా మీ తండ్రి కూడా నీకు ఎవరో తెలిసి ఉండదు. ఏదైనా రెండు విషయాలు జరగవచ్చు. నేను చనిపోవచ్చు. లేదంటే బ్రతకచ్చు. కానీ ఇక్కడ నువ్వు ఆలోచించాల్సిన విషయం మరొకటి ఉంది.

ఒక పెద్ద తుఫానును ఎదుర్కొంటావు
నేను చనిపోయాను అనుకో ఇకపై ఎలాంటి సెలబ్రెటీ పై కూడా నువ్వు ఇలాంటి కామెంట్స్ చేయలేవు. ఇక నేను దేవుడి దయ వల్ల అభిమానుల ప్రేమ వల్ల బ్రతికాను అనుకో.. నువ్వు మాత్రం ఒక పెద్ద తుఫానును మాత్రం తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 90 మిలియన్ల మంది అభిమానులు నీపై దాడి చేయవచ్చు.
Recommended Video

నిన్ను తన్నమని చేబితే
దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నేను ఇంకా దీని గురించి ఎక్కువగా ఆలోచించి వారికి చెప్పలేదు. వాళ్ళ కోపం మాత్రం ప్రపంచాన్ని దాటుతుంది అని గుర్తు పెట్టుకుంటే మంచిది. వాళ్ళను నిన్ను తన్నమని చేబితే ఓ నిర్ములనలా పరిస్థితులు ఎదుర్కోవల్సి ఉంటుంది. పశ్చిమ నుంచి తూర్పు వరకు అలాగే ఉత్తర నుంచి దక్షిణం వరకు వాళ్ళ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటే.. తట్టుకోలేవు జాగ్రత్త అంటూ అమితాబ్ ట్రోల్ చేసిన వ్యక్తిపై సీరియస్ అయ్యారు.


Click it and Unblock the Notifications











