Chehre Trailer... అదరగొట్టిన అమితాబ్
ఈ మధ్య బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పోషిస్తోన్న పాత్రలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. పింక్ సినిమా నుంచి అమితాబ్ పాత్రలు తీరు తెన్నలు అన్నీ మారిపోయాయి. అన్యాయం జరిగిన యువతుల తరుపున, తప్పును వెలికి తీసేందుకు శోధన చేసే పాత్రల్లో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పింక్, బాద్లా వంటి సినిమాల తరువాత అమితాబ్ మరో అద్బుతమైన పాత్రలో కనిపించబోతోన్నాడు.
అమితాబ్, ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్‌లో రాబోతోన్న చెహ్ రే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో అమితాబ్ వెరైటీ రోల్‌ను పోషించినట్టు కనిపిస్తోంది. తప్పుకు శిక్షలే ఉంటాయి.. ఇక్కడ వాదనలు ఉండవు.. పరిహారమే ఉంటుందనే టైపులో పెట్టిన డైలాగ్‌లు అదిరిపోయాయి. మొత్తానికి ఈ మూవీని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అద్భుతంగా మలిచినట్టు కనిపిస్తోంది.

ఈ మూవీలో రియా చక్రవర్తి కూడా నటించింది. సుశాంత్ సింగ్ కేసు తరువాత రియా కనిపించబోతోన్న మొదటి సినిమా ఇదే. ఏప్రిల్ 9న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. రూమీ జఫ్రీ దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీలో అన్ను కపూర్, క్రిస్టల్ డిసౌజా, సిద్దాంత్ కపూర్‌లు ముఖ్య పాత్రలను పోషించారు. ప్రస్తుతం చెహ్ రే ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేమ్ ఆడేందుకు సిద్దమా? అంటూ అమితాబ్ వేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











