Don't Miss!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పెళ్లికి ముందే జయతో అమితాబ్ అలా.. తండ్రి మందలింపుతో.. 47 ఏళ్ల మ్యారేజ్ లైఫ్ గురించి బిగ్ బీ
బాలీవుడ్ సూపర్‌స్టార్స్ అమితాబ్ బచ్చన్, జయబచ్చన్ తమ 47 ఏళ్ల దాంపత్య జీవితాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకొంటున్నారు. జూన్ 3 తేదీ, 1973లో వీరి వివాహం చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో జరిగింది. ఆ విషయాన్ని తన పెళ్లి రోజు సందర్భంగా అమితాబ్ ట్విట్టర్లో వెల్లడించారు. అంతేకాకుండా తమ పెళి ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ..
47 ఏళ్ల క్రితం జయతో
1973లో అంటే 47 ఏళ్ల క్రితం జంజీర్ మూవీ రిలీజ్ నేపథ్యంలో మేము ఓ నిర్ణయం తీసుకొన్నాం. ఒకవేళ జంజీర్ రిలీజ్ అయితే జయ, మరికొంత మంది స్నేహితులతో కలిసి లండన్ ట్రిప్‌కు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకొన్నాం. ఆ విషయం మా నాన్న, కవి హరివంశ్ రాయ్ బచ్చన్‌కు తెలిసింది. జయతో లండన్ వెళ్లాలనుకొంటే వెంటనే పెళ్లి చేసుకో అని మందలించారు.
తండ్రి మందలింపుతో
లండన్‌కు వెళ్లడానికి జూన్ 3 తేదీ అర్ధరాత్రి ఫ్లయిట్. అప్పటికే టికెట్లు బుక్ అయ్యాయి. ఇక నా తండ్రి మందలింపుతో చేసేది ఏమీ లేక వెంటనే పూజారులను పిలిచాం. అప్పటికప్పుడు సమీప బంధువులకు సమాచారం అందించాం. మలబార్ హిల్స్‌లో మా వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే ఉన్నట్టుంది వర్షం పడటం ప్రారంభించింది. అది శుభసూచకమని పెద్దలు ఆశీర్వదించారు అని అమితాబ్ తెలిపారు.
డ్రైవర్ తోసేశాడు..
పెళ్లి దుస్తుల్లో రెడీ అయి మలబార్ హిల్స్‌కు వెళ్లాలని బయలుదేరాను. స్వయంగా కారు నడుపుకొంటూ వెళ్లాలని డోర్ తీయగానే.. నా డ్రైవర్ నన్ను పక్కకు తోసి నేను డ్రైవ్ చేస్తానని అన్నాడు. ఎలాగు పెళ్లిలో గుర్రం ఎక్కడం లేదు కదా.. గుర్రానికి బదులు నేనే నీ కారును డ్రైవ్ చేస్తానని చెప్పి మలబారు హిల్స్‌కు వాహనాన్ని పరుగులు పెట్టించాడు.
Recommended Video
అదే రాత్రి లండన్‌కు ప్రయాణం
మలబార్ హిల్స్‌లోని 7వ రోడ్డులో జేవీపీడీ స్కీమ్ అనే ఇంటిని అద్దెకు తీసుకొని పెళ్లికి ఏర్పాట్లు చేశాం. మేము అక్కడకు చేరుకోగానే పెళ్లి కోసం కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసి అందరూ సిద్ధంగా ఉన్నారు. వెంటనే పెళ్లి కార్యక్రమం పూర్తి చేసుకొన్నాం. జయ మెడలో మూడు మూళ్లు వేసుకొని భార్యగా స్వీకరించాను. వెంటనే అర్ధరాత్రి లండన్‌కు వెళ్లేందుకు ఫ్లయిట్ ఎక్కాం అని అమితాబ్ తన మధురానుభూతులు నెమరు వేసుకొన్నారు.