అమేజింగ్ అంటూ అమితాబ్ ఆశ్చర్యం.. అది ముందే ఊహించారా?.. నెటిజన్ల కామెంట్స్
ఒక్కోసారి యాధృచ్చికమో ఏమో తెలియదు గానీ కొన్ని సంఘటనలకు కారణం చెప్పలేం. ఇలాంటి ఘటనే అమితాబ్ నటించిన చిత్రంలో జరిగింది. ఎన్నో యేళ్ల క్రితం అమితాబ్ నటించిన ఓ చిత్రంలో ఓ సన్నివేశంలో గోడపై ఓ పేరు కనిపిస్తుది. దాదాపు పద్దెనెమిదేళ్ల తరువాత అదే పేరుతో ఓ సినిమా వచ్చింది. అయితే ఈ విషయాన్ని తాజాగా ఓ నెటిజన్ పసిగట్టి అమితాబ్ వరకు విషయాన్ని చేరవేశాడు. అది తెలుసుకున్న అమితాబ్ కూడా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

సోషల్ మీడియాలో యాక్టివ్..
అమితాబ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమితాబ్ చేసే ట్వీట్స్ ఒక్కోసారి ఎంతగానో ట్రోల్ అవుతుంటాయి. ఈ మధ్య అమితాబ్ చేసిన ట్వీట్స్, ఆయన్ను ముసలోడా అంటూ సంబోధించడం, ఫేక్ న్యూస్‌ను అమితాబ్ షేర్ చేయడం ట్రెండ్ అయ్యాయి.

వాట్సప్ బ్యాన్..
అమితాబ్ బచ్చన్ వాట్సప్‌లో వచ్చే ఫేక్ న్యూస్‌ను షేర్ చేస్తున్నారని, ఆయన తన వాట్సాప్‌ను తీసేస్తే మంచిదని ట్వీట్స్ చేశారు. నేషనల్ వైడ్‌గా ఆ విషయాన్ని ట్రెండ్ చేశారు. ఇప్పటికే అమితాబ్ ట్వీట్స్ కింద వచ్చే కామెంట్లలో వాట్సాప్ ఉదంతాన్ని ఉటంకిస్తుంటారు.

అగ్నిపథ్ సీన్..
అమితాబ్‌కు యాంగ్రీమెన్ అనే ట్యాగ్‌ను తీసుకొచ్చిన అగ్నీపథ్ చిత్రం 1990లో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ చిత్రంలో జైల్ సీన్‌లో అమితాబ్ ఇద్దరిని కాల్చి వేస్తాడు. ఆ సందర్భంలో జైలు గోడపై భూత్ నాథ్ అని రాసి ఉంటుంది. ఓ నెటిజన్ దాన్ని పాయింట్ అవుట్ చేస్తాడు. అయితే భూత్ నాథ్ పేరిట 2008లో ఓ సినిమా రావడాన్ని గుర్తు చేస్తాడు.

అమేజింగ్ అంటూ ఆశ్చర్యం..
ఇదే విషయాన్ని అమితాబ్ చెబుతూ.. అమేజింగ్ జైలు గోడపై భూత్ నాద్ అని రాసి ఉంది.. అయితే ఎన్నో యేళ్ల తరువాత ఆ చిత్రం వచ్చింది అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆ టైటిల్‌ను ముందే ఊహించారా? ట్వీట్ నెంబర్ వేయడం మరిచిపోయారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











