twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్‌కు కరోనా వైరస్ .. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..వీడియో వైరల్

    |

    సాధారణ జనాలతో పాటు సెలబ్రెటీలు కూడా కరోనా నుంచి తప్పించుకోలేరని ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ శనివారం సాయత్రం కరోనా భారిన పడినట్లు వార్తలు రాగానే ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేశాయి. వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని అలాగే వారు వైరస్ వ్యాధి నుంచి వీలైనంత త్వరగా కొలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఒక వివరణ ఇచ్చారు. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా కోవిడ్ 19 సోకిన తరువాత మొదటిసారి ఒక వీడియో ద్వారా పరిస్థితిపై స్పందించారు.

    Recommended Video

    #AmitabhBachchan : Coronavirus సోకిన తరువాత మొదటిసారి మాట్లాడిన Amitabh Bachchan..!
    అనుమానం రాగానే..

    అనుమానం రాగానే..

    అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ముంబైలోని నానావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. లక్షనాలు ఉన్నాయని అనుమానం రావడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా శనివారం పాజిటివ్ అని రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే ఈ విషయంపై ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా అమితాబ్ వివరణ ఇస్తున్నారు. ఇక మొదటిసారి ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.

    వివరణ ఇచ్చిన అమితాబ్ బచ్చన్..

    వివరణ ఇచ్చిన అమితాబ్ బచ్చన్..

    పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేషని నానవతి హాస్పిటల్ వైద్య సిబ్బంది తమని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలిపారు. వారికి తన కృతజ్ఞతలు, దైవ ఆలయాలు మూసి వేసినప్పటికి వాళ్ళు డాక్టర్ల రూపంలో మనకు రక్షణగా నిలుస్తున్నారు అన్నారు. ఇక కరోనా వైరస్ కారణంగా ఎవరు బయపడవద్దంటూ.. ధైర్యంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వైరస్ ని ఎదుర్కోవాలని అన్నారు.

    ఎన్నో ఇబ్బందులు..

    అలాగే మీ ప్రేమ ఆశీస్సులు ఉన్నంత వరకు కూడా తనకు ఏమి కాదని ప్రస్తుతం తాను ధైర్యంగా ఉన్నట్లు అమితాబ్ బచ్చన్ తెలియజేశారు. ఇక ఈ వైరస్ వలన ఎంతమంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్థం అవుతోందని అంటూ.. ఆర్ధికంగా, మానసికంగా ఎంతో క్షోభను అనుభవిస్తున్నారని మరికొన్ని రోజులు నిలకడగా ఉంటే ఈ కష్టం నుంచి బయటపడవచ్చని అన్నారు.

    స్పందించిన వైద్యులు..

    స్పందించిన వైద్యులు..

    ఇక వైద్యులు కూడా అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఒక వివరణ ఇచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి చాలా నిలకడగా ఉందని గత కొన్నిరోజులుగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుందని ఆయన చెప్పడం వలన పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అయితే ఆయాన ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.

    ఆ రెండు విషయాలు..

    ఆ రెండు విషయాలు..

    ఇక అమితాబ్ బచ్చన్ విషయంలో ఎక్కువగా రెండు విషయాలను పరిగణలోకి తీసుకొని వైద్యం అందిస్తున్నారు. వయసుతో పాటు శారీరక సమస్యలను దృష్టిలో ఉంచుకొని వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అనుక్షణం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నట్లు చెబుతున్న వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని అన్నారు.

    English summary
    Amitabh Bachchan, Abhishek hospitalized: Big B tested corona Positive. He tweeted, “I have tested CoviD positive. shifted to Hospital. hospital informing authorities.family and staff undergone tests , results awaited ..All that have been in close proximity to me in the last 10 days are requested to please get themsel
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X