ఇర్ఫాన్ మృతి.. హృదయం బద్దలైంది, భయంకరమైన వార్త.. అక్షయ్, అజయ్ దేవగణ్‌ల ఎమోషనల్ ట్వీట్
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) మృతితో సినీ లోకం నివ్వెరపోయింది. కోలన్ క్యాన్సర్ (పెద్దపేగు సంబంధిత వ్యాధి)తో బాధపడుతున్న ఆయన నేడు అనంతలోకాలకు చేరుకున్నాడు. పరిస్థితి విషమించడంతో నిన్న ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం (ఏప్రిల్ 29) ఉదయం మరణించారు. ఇర్పాన్ మృతి పట్ల సినీ లోకం స్పందిస్తోంది. తారలంతా తమ సంతాపాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ఎంతో శూన్యాన్ని మిగిల్చారు..
ఇర్ఫాన్ మృతిపై స్పందిస్తూ.. ‘కాసేపటి క్రితమే ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త విన్నాను.. నన్నెంతో కలిచివేసింది ఆ వార్త.. నమ్మశక్యం కాని ప్రతిభ, గొప్ప సహచరుడు, ప్రపంచపు సినిమా రంగానికి ఎంతో అందించారు.. మనల్ని ఇంత త్వరగా ఒంటరి చేస్తూ.. శూన్యాన్ని మిగిల్చారు.. ఆయన ఆత్మకు శాంతి చూకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా'ని అమితాబ్ ట్వీట్ చేశారు.
Recommended Video
భయంకరమైన వార్త..
ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త విన్న అక్షయ్ కుమార్ షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘ఇదొక భయంకరమైన వార్త.. ఇర్ఫాన్ ఖాన్ చనిపోయాడన్న వార్త విన్నాక ఎంతో బాధ వేసింది.. మా తరంలోని గొప్ప నటుడు. ఇలాంటి విపత్కర పరిస్థితిలొ ఆయన కుటుంబానికి మరింత బలాన్ని ఆ భగవంతుడు ఇవ్వాల'ని కోరుకున్నాడు.
హృదయం బద్దలైంది..
అజయ్ దేవగణ్ స్పందిస్తూ.. ‘ఇర్పాన్ ఖాన్ మరణవార్త తెలిశాక హృదయం బద్దలైంది. ఇండియన్ సినిమా ఎప్పటికీ తీరని లోటు..ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తున్నా'ని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











