»   » సల్మాన్ ఖాన్ జైలు ఇష్యూ: మెగాస్టార్ అమితాబ్ అలా చేయడంతో ఫ్యాన్స్ ఆగ్రహం!

సల్మాన్ ఖాన్ జైలు ఇష్యూ: మెగాస్టార్ అమితాబ్ అలా చేయడంతో ఫ్యాన్స్ ఆగ్రహం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాలుగైదు రోజులుగా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ఇష్యూ హాట్ టాపిక్ నడుస్తోంది. 20 ఏళ్ల క్రితం నాటి కృష్ణ జింకల కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన జోధ్‌పూర్ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించడం అభిమానులను హర్ట్ అయ్యేలా చేసింది. ఈ విషయంలో వారు తమ అసంతృప్తిని వెల్లడిస్తూ సోషల్ మీడియాను మోతెక్కించారు. అసలే మంట మీద సల్మాన్ అభిమానులను అమితాబ్ బచ్చన్ చర్య మరింత రగిలిపోయేలా చేసింది. దీంతో ఆయన్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ప్రారంభించారు.

 ఎందుకింత ఆగ్రహం? ఇంతకీ అమితాబ్ ఏం చేశారు?

ఎందుకింత ఆగ్రహం? ఇంతకీ అమితాబ్ ఏం చేశారు?

ఇంతకీ అమితాబ్ బచ్చన్ ఏం చేశారని ఇంత ఆగ్రహం? కోర్టు తీర్పును ఆయన సమర్ధించారా? లేక సల్మాన్ ఖాన్‌కు తగిన శాస్తి జరిగింది అని ఏమైనా ప్రకటన చేశారా? అంటే అలాంటిదేమీ లేదు. కేవలం సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన ఓ పోస్టుకు లైక్ కొట్టడమే అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

అమితాబ్ బచ్చన్ లైక్ కొట్టిన పోస్టు ఇదే

అమితాబ్ బచ్చన్ లైక్ కొట్టిన పోస్టు ఇదే

జైలు శిక్ష విధించిన అనంతరం ఆయన్ను అధికారులు నేరుగా జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు లోపలి ఫోటోలు ఓ మేగజైన్ పోస్టు చేయగా దానికి అమితాబ్ బచ్చన్ లైక్ కొట్టారు. ఆయన అలా చేయడాన్ని మరో విధంగా అర్థం చేసుకున్న అభిమానులు బిగ్ బిని టార్గెట్ చేస్తూ పోస్టులు చేయడం ప్రారంభించారు.

దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్

దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్

సల్మాన్ ఖాన్‌కు జైలు శిక్ష పడటం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కొందరు సల్మాన్‌కు తగిన శాస్తి జరిగిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇలా హేట్ చేసే వారికి సమాధానంగా సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ తన సోదరుడి స్మైల్ ఫోటోస్ పోస్తు చేశారు. ‘నా బలం, నా బలహీనత, నా గర్వ, నా ఆనందం, నా జీవితం, నా ప్రపంచం, దేవుడి బిడ్డ' అంటూ తన సోదరుడిపై తన ప్రేమను వ్యక్తపరించింది. అందరూ బావుండాలి అంటూ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసే ప్రయత్నంచేసింది.

 బెయిల్ రావడంతో సల్మాన్ ఫ్యాన్స్ సంబరాలు

బెయిల్ రావడంతో సల్మాన్ ఫ్యాన్స్ సంబరాలు

ఈ కేసులో సల్మాన్ ఖాన్‌కు బెయిల్ లభించడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ముంబైలోని ఆయన నివాసానికి చేరుకుని తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కొందరు ఆనందంతో డాన్స్ చేశారు.

జైలు శిక్ష పడ్డా ఏమాత్రం తగ్గని అభిమానం

జైలు శిక్ష పడ్డా ఏమాత్రం తగ్గని అభిమానం

నేరం రుజువై, జైలు శిక్ష పడ్డప్పటికీ సల్మాన్ ఖాన్‌ మీద అభిమానుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ‘వి సపోర్ట్ సల్మాన్', ‘వెల్ కం బ్యాక్ సల్మాన్', ‘వి లవ్ సల్మాన్' అంటూ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. కొందరు బీయింగ్ హ్యూమన్ టీ షర్టులు ధరించి తమ అభిమాన హీరోకు మద్దతు ప్రకటించారు.

 సల్మాన్ ఎలాంటి తప్పు చేయలేదని ఫీలవుతున్న ఫ్యాన్స్

సల్మాన్ ఎలాంటి తప్పు చేయలేదని ఫీలవుతున్న ఫ్యాన్స్

‘సల్మాన్ ఖాన్ బెయిల్ మీద బయటకు రావడంపై మేము చాలా సంతోషంగా ఉంది. అతడు ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేస్తున్నాడు, అతడు ఎలాంటి తప్పు చేయలేదని మేము భావిస్తున్నాం... అని అభిమానులు మీడియాతో వ్యాఖ్యానించారు.

 సల్మాన్ ఖాన్ సినిమాలు

సల్మాన్ ఖాన్ సినిమాలు

ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘రేస్ 3' మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రాన్ని జూన్ 15, 2018న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Last few days have been gruesome for Salman Khan as well as his family and fans, as the actor got convicted in the twenty years old Blackbuck poaching case and spent two consecutive days and nights inside the Jodhpur jail. As expected, Twitter was inundated with angry tweets as fans were really furious with the verdict of the court. Amitabh Bachchan ANGERS Salman Khan's Fans, Likes Pictures Of The Superstar Entering The Jail.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X