Amitabh Bachchan: 'ఆ విషయంలో తప్పు చేశా.. నన్ను క్షమించండి': అమితాబ్ వీడియో వైరల్..

Amitabh Bachchan: బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్.. ఆయన గురించి ప్రత్యేక పరిచయమే అవసరం లేదు. గత ఐదు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో టాప్ యాక్టర్ గా కొనసాగుతున్నారు. తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 82 ఏండ్ల వయసులోనూ నటిస్తూ.. యంగ్ హీరోస్ కు పోటీగా నిలుస్తున్నారు. బాలీవుడ్ షాహెన్‌ షాగా గుర్తింపు తెచ్చుకున్న అమితాబాబ్ ఇటీవల నాగ్ అశ్విన్ పాన్ ఇండియన్ మూవీ 'కల్కి 2898 AD'లో కనిపించారు. ఆశ్వత్థామ పాత్రలో ఆయన నటన అద్భుతం.. నిజంగా ఆ పాత్రకు ఆయన ప్రాణం పోశారంటే.. అతిశయోక్తి కాదు. అలాంటి లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు. అసలేం ఏం జరిగింది ? ఇంతకీ ఏ విషయంలో ఆయన క్షమాపణలు చెప్పారో మీరు కూడా ఓ లూక్కేయండి.

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. హిందీ పరిశ్రమకు చెందిన అమితాబ్ బచ్చన్‌ నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆయన తన కెరీర్ లో ఎన్నో కష్టాలకు ఎదురు నిలిచారు. ఒకానొక దశలో చావు అంచుల దాకా వెళ్లొచ్చారు. ఇంకా బిగ్ బీ అమితాబ్ పని అయిపోయింద్రా.. అనుకున్న దశలో ఆయన బౌన్స్ బ్యాక్ అయిన తీరు ఎందరితో ఆదర్శం. తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ప్రేక్షకులకు వినోదం అందిస్తూనే ఉంటానని అమితాబ్ బచ్చన్ పలుమార్లు చెప్పారు.

Amitabh bachchan apologises to fans from pronounced wrong Marathi word amitabh bachchan share video

ఆయన వెండితెర మీదనే కాదు.. బుల్లితెరపై కూడా ఆయన బిగ్ బీ నే.. కౌన్ బనేగా కరోడ్ పతి అనే షోకు హోస్ట్ గా వ్యవహరించి.. ఆ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేశారు. ఈ రియాలిటీ షో ద్వారా కోట్లాది మంది భారతీయులకు మరింత చేరువయ్యారు అమితాబ్. ఆయనతో కెరీర్ ప్రారంభించిన వారందరూ సినిమాలకు గుడ్ బై చెప్పి.. ఓల్డ్ ఏజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, అమితాబ్ మాత్రం 80 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంతో పరుగులెత్తూన్నారు. ఏజ్ అనేది కేవలం నెంబర్ మాత్రమేనని.. అది శరీరానికే కానీ, మనసుకు కాదని నిరూపించారు అమితాబ్ .

ఇదిలా ఉంటే.. బిగ్ బి క్షమాపణలు చెప్పాల్సిన అవసరమేంటీ? అని ఆశ్చర్యపోతారా.. ఇటీవల అమితాబ్ బచ్చన్ 'స్వచ్ఛ భారత్ అభియాన్' కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఓ వీడియో సందేశాన్ని షేర్ చేశారు. అయితే.. ఆ వీడియోలో చెత్త అనే అర్థం వచ్చే పదాన్ని మరాఠీలో తప్పుగా ఉచ్ఛరించారట.ఈ విషయాన్ని తన స్నేహితుడు సుదేష్ భోంస్లే తనకు తెలియజేశారంట. ఉచ్చారణలో పొరపాటు జరిగినట్లు తెలియగానే సరిదిద్దుకున్నారు బిగ్ బీ.

Amitabh bachchan apologises to fans from pronounced wrong Marathi word amitabh bachchan share video
ఈ క్రమంలో తాజాగా మరో కొత్త వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో బిగ్ బి అమితాబ్ మాట్లాడుతూ..'హలో నేను అమితాబ్ బచ్చన్.. ఇటీవల నేను ఒక వీడియో చేశాను. ఆ మీడియోలో మరాఠీలో 'గార్బేజ్' అనే పదాన్ని తప్పుగా ఉచ్చరించానని నా స్నేహితుడు నాకు చెప్పాడు. అందుకే మళ్లీ కొత్త వీడియో చేశాను. నా తప్పును సరిదిద్దుకుంటూ.. మరాఠి ప్రజలను క్షమాపణలు కోరుతున్నాను. నేను చెత్త వేయను ధన్యవాదాలు' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమితాబ్ బచ్చన్ వీడియోపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X