twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్ ప్రదర్శించిన మానవత్వం.. 1500 మందిని 4 చార్టెడ్ ఫ్లయిట్స్‌‌లో!

    |

    బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి గొప్ప మనసు చాటుకొన్నారు. లాక్‌డౌన్ కారణంగా ముంబైలో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఉత్తర ప్రదేశ్‌లోని తమ స్వస్థలాలకు పంపించడానికి ఏర్పాట్లు చేసి మానవత్వాన్ని చాటుకొన్నారు. వలస కార్మికుల కోసం అమితాబ్ తీసుకొన్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

     1500 మంది వలస కార్మికుల గుర్తింపు

    1500 మంది వలస కార్మికుల గుర్తింపు

    లాక్‌డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న 1500 మంది వలస కార్మికులను గుర్తించిన అమితాబ్ వారికి కోసం సొంత ఖర్చులతో విమానాలు, రైలు సర్వీసులను ఏర్పాటు చేశారు. గురువారం నాలుగు ప్రత్యేక ఫ్లయిట్స్ ఏర్పాటు చేసి 700 మంది వలస కార్మికులను ఉత్తరప్రదేశ్‌కు పంపించారు. ఈ కార్యక్రమాలను ఏబీ కార్పోరేషన్ లిమిటెడ్ ఎండీ రాజేష్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు.

     700 మందిని యూపీకి

    700 మందిని యూపీకి

    వలస కార్మికులను ఆదుకొన్న విషయాన్ని అమితాబ్ సన్నిహితుడు రాజేశ్ యాదవ్ వెల్లడిస్తూ.. ఇప్పుటి వరకు నాలుగు ఫ్లయిట్స్‌ ఏర్పాటు చేసి 700 మందిని ఉత్తర ప్రదేశ్‌కు పంపించాం. గురువారం రెండు విమానాల ద్వారా కొంతముందిని పంపించాం. మరికొంత మందిని పంపించడానికి కొన్ని ట్రైన్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఈ మేరకు అధికారులు, ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం అని తెలిపారు.

    మిషన్ మిలాప్ పేరుతో

    మిషన్ మిలాప్ పేరుతో

    వలస కార్మికుల తరలింపుకు అమితాబ్ చేపట్టిన కార్యక్రమానికి మిషన్ మిలాప్ అని పేరు పెట్టాం. హాజీ ఆలీ దర్గా ట్రస్టీ, మహిమ్ దర్గా మేనేజింగ్ ట్రస్టీలతో కలిసి అమితాబ్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల దాదాపు 1500 మందికి పైగా వలస కార్మికులు మా వద్ద రిజిస్టర్ చేసుకొన్నారు. అయితే సాంకేతిక కారణాల వల్ల వారు ప్రయాణించే ట్రైన్లు రద్దు కావడంతో వారిని ప్రత్యేక చార్టెడ్ ఫ్లయిట్ల ద్వారా పంపించాల్సి వచ్చింది అని రాజేశ్ యాదవ్ చెప్పారు.

    English summary
    Amitabh Bachchan arranges 4 Charted flights for 1500 migrants who is related to Uttar Pradesh. Amitabh Bachchan started Mission Milap by collabrating with Haji Ali Dargah trustee, Amitabh Bachchan collabration with Mahim Dargah managing trustee.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X