120 కోట్ల ట్యాక్స్ చెల్లింపుతో టాప్ లేపిన అమితాబ్.. షారుక్, విజయ్, సల్మాన్ ఎన్ని కోట్లు చెల్లించారంటే?
ఇండియన్ సినిమా రంగంలో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ఎన్నో భారీ విజయాలు అందించిన సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన 82వ పడిలో కూడా రికార్డులు తిరగరాస్తున్నారు. గత 5 దశాబ్దాలుగా భారతీయ సినిమా పరిశ్రమను ఏలుతున్న ఆయన ఈ ఏడాది అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లించిన సినీ ప్రముఖుడిగా ఘనతను సాధించారు. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఆయన దక్షిణాది, ఉత్తరాది స్టార్ హీరోల కంటే అధికంగా సంపాదనను ఆర్జించి తన కెరీర్‌కు తిరుగు లేదని నిరూపించుకొన్నారు. ఆయన గతేడాది సంపాదించిన డబ్బు ఎంత? ఎన్ని కోట్లు ట్యాక్స్ కట్టారు అనే వివరాల్లోకి వెళితే..
సినిమా పరిశ్రమలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న అమితాబ్ బచ్చన్ పేరు వినని వారుండరు. ఆయన వయస్సు ప్రస్తుతం 82 సంవత్సరాలు. ఈ ఏజ్‌లో కూడా క్షణం తీరిక లేకుండా షూటింగులతో బిజీగా ఉంటారు. సినిమాలు, టెలివిజన్, ఓటీటీ, యాడ్స్, సామాజిక సేవ, ఇలా ఎన్నో పనుల్లో నిమగ్నమై సేవలు అందిస్తూ నేటితరం హీరోలకు స్పూర్తిగా నిలిస్తున్నారు.

గత సంవత్సరం నిత్యం షూటింగులతో బిజీగా ఉన్న అమితాబ్ బచ్చన్ సుమారుగా 350 కోట్ల రూపాయలు ఆర్జించారు. ఆయన సంపాదన మేరకు సుమారుగా 120 కోట్ల రూపాయలను పన్నుగా చెల్లించి పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చాడు. ఈ మొత్తంలో పన్ను చెల్లించి ఇండియాలో అత్యధికంగా ట్యాక్స్ చెల్లించిన సినీ తారల్లో ఒకరుగా నిలిచారు. షారుక్, విజయ్, సల్మాన్ ఖాన్ లాంటి వారిని పన్ను చెల్లింపులో వెనక్కి నెట్టారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లింపు జరిపిన సెలబ్రిటీల వివరాల్లోకి వెళితే.. అమితాబ్ 120 కోట్లు, షారుక్ ఖాన్ 92 కోట్ల రూపాయలు, దళపతి విజయ్ 80 కోట్ల రూపాయలు, సల్మాన్ ఖాన్ 75 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధికంగా పన్ను చెల్లించిన వారి జాబితాలో అమితాబ్ అగ్రస్థానంలో నిలిచారు.
అమితాబ్ బచ్చన్ కెరీర్ విషయానికి వస్తే.. గత 18 సీజన్లుగా కేబీసీకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఇక నుంచి తాను యాంకర్ వ్యవహరించనని తప్పుకొన్నాడు. ఇక కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో, సెక్షన్ 84 మూవీ సీక్వెల్‌లో నటించనున్నారు. అలాగే బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయాణ పార్ట్ 1 సినిమాలో జటాయువు పాత్రలో కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











