31 కోట్లతో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన అమితాబ్.. సన్నిలియోన్ ఉండే భవనంలోనే

సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ ఖాతాలో మరో ఖరీదైన బంగ్లా చేరింది. ముంబై, మహారాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విలాసవంతమైన భవనాలు బిగ్‌బీకి ఉన్నాయి. ముంబైలోని జుహులో జల్సాలో నివాసం ఉంటున్నారు. అలాగే ముంబైలో ప్రతీక్ష, జనక్ అనే భవనాలు కూడా ఆయన పేరుపై ఉన్నాయి. ఇటీవల మరో అద్బుతమైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ ఇంటి వైశాల్యం 5184 చదరపు మీటర్లు (60 వేల చదరపు అడుగులు) అని తెలిసింది.

బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. గత డిసెంబర్‌లోనే విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ అయింది. ఇందుకోసం అమితాబ్ 62 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించారు అని బిజినెస్ మ్యాగజైన్ వెల్లడించింది.

Amitabh Bachchan becomes Sunny leone neighbour, buys posh flat for 31 crores

అమితాబ్ కొనుగోలు చేసిన ఫ్లాట్స్ డాక్యుమెంట్ల ప్రకారం.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించిన అపార్ట్‌మెంట్‌లో 27, 28 ఫ్లోర్‌లో ఉంది. ఈ ఫ్లాట్‌కు ఆరు కారు పార్కింగ్స్ ఉన్నాయి.

ఇంకా ఈ అపార్ట్‌మెంట్‌లో ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కూడా రూ.25 కోట్లతో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. అలాగే మార్చి 28 తేదీన సన్నిలియోన్ కూడా 16 కోట్లతో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X