బయటకు రాలేని స్థితిలో అమితాబ్ బచ్చన్, తీవ్రమైన నొప్పితో... దర్శన్ రద్దు!
Recommended Video
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం జల్సా ప్రతి ఆదివారం సందడిగా ఉంటుంది. ముంబై జుహు ప్రాంతంలో ఉన్న ఈ ఇంటికి పలువురు ఫ్యాన్స్ తమ అభిమాన నటుడి దర్శనం కోసం వస్తుంటారు. బిగ్ బి సైతం వారిని ఉత్సాహ పరుస్తూ బయటకు వచ్చి అందరి కలుస్తారు. గత 36ఏళ్లుగా జల్సా వద్ద అభిమానుల జాతర కొనసాగుతోంది.
అయితే గడిచిన ఆదివారం జల్సా వద్దకు వచ్చిన అభిమానులకు నిరాశే మిగిలింది. అమితాబ్ కనిపించక పోవడంతో అందరూ నిరాశగా వెనుదిరిగారు. బయటకు వచ్చి అభిమానులను పలకరించలేని స్థితిలో అమితాబ్ ఉండటమే ఇందుకు కారణం.

తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నానంటూ అమితాబ్ ట్వీట్
‘‘ఈ రోజు సండే దర్శన్‌కు రావడం లేదు. అనారోగ్యం కారణంగా బెడ్ పై నుంచి లేవలేని స్థితిలో ఉన్నాను. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. ఈ విషయం అందరికీ చెప్పండి' అంటూ అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా అభిమానులకు ముందుగానే సందేశం పంపారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నానంటూ అమితాబ్ ట్వీట్
‘‘ఈ రోజు సండే దర్శన్‌కు రావడం లేదు. అనారోగ్యం కారణంగా బెడ్ పై నుంచి లేవలేని స్థితిలో ఉన్నాను. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. ఈ విషయం అందరికీ చెప్పండి' అంటూ అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా అభిమానులకు ముందుగానే సందేశం పంపారు.

భయపడాల్సింది ఏమీలేదు
అయితే అమితాబ్ నుంచి ఈ మెసేజ్ రాగానే చాలా మంది అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. ఎవరూ తన ఆరోగ్యం గురించి కంగారు పడకుండా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు బిగ్ బి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, నొప్పి వల్ల బయటకు రాలేక పోతున్నాను, అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేశారు.

బాధిస్తోన్న కడుపునొప్పి
1982లో కూలీ షూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్ర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మృత్యువుతో పోరాడి విజయం సాధించారు. అయితే అప్పటి ఎఫెక్ట్ ఆయన్ను తరచూ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ క్రమంలో 2005, 2012లో కడుపులో సర్జరీలు జరిగాయి. గతేడాది కూడా ఆయన ఆసుపత్రిలో గడిపారు. తాజాగా మరోసారి కడుపునొప్పి తిరగబెట్టినట్లు తెలుస్తోంది.

అలుపెరుగని సినీ ప్రయాణం
అమితాబ్ బచ్చన్ వయసు ప్రస్తుతం 76 సంవత్సరాలు. తరచూ అనారోగ్యం వేధిస్తున్నా, వయసు సంబంధమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ నటుడిగా ఆయన అలుపెరుగని ప్రయాణం సాగిస్తున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ‘బద్లా' చిత్రం విజయం అందుకుంది. దీంతో పాటు బ్రహ్మాస్త్ర, సైరా నరసింహారెడ్డి, తేరా యార్ హో మే, లక్ష్మీ బాంబ్, ఝండ్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











