విషాదంలో అమితాబ్ కుటుంబం.. ఎవరివీ అంత్యక్రియలు?
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించిన ఓ పోస్ట్ నాలుగు రోజులుగా ఫేస్ బుక్, వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. ''అమితాబ్ వద్ద గత 40 ఏళ్లుగా పని చేసిన సర్వెంట్ ఇటీవల మరణించారని, ఇంతకాలం అతడు తనకు చేసిన సేవలకు కృతజ్ఞతగా అతడి పాడె మోసిన అమితాబ్ గ్రేట్ మ్యాన్... డబ్బు అందరి దగ్గర ఉంటుంది, హ్యూమానిటీ అనేది కొందరి వద్ద మాత్రమే ఉంటుంది, హాట్సఫ్ అమితాబ్'' అంటూ అందులో ఉంది.
వైరల్ అవుతున్న ఫోటోలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కలిసి పాడె మోస్తున్నట్లు ఉండటంతో ఇది నిజమే అని నమ్మి అభిమానులు దీన్ని షేర్ చేయడం మొదలు పెట్టారు. అయితే వైరల్ అవుతున్న ఫోటో నిజమే కానీ... అమితాబ్ బచ్చన్ ఇంట్లో సర్వెంట్ ఎవరూ చనిపోలేదని తేలింది. ఈ నెల ప్రారంభంలో అమితాబ్ బచ్చన్ సెక్రటరీ, మేనేజర్ శీతల్ జైన్ మరణించారు. ఈ సందర్భంగా అమితాబ్, అభిషేక్ ఆయన డెడ్ బాడీ ఉన్న స్టెచర్ మోశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో ఈ రకంగా వైరల్ అవుతోంది.

అమితాబ్ బచ్చన్... జూన్ 8న శీతల్ జైన్ మరణం గురించి తన బ్లాగులో పేర్కొంటూ అతడితో తనకు ఉన్న 40 ఏళ్ల అనుబంధం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఫోటో మరో రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శీతల్ జైన్ గత 40 ఏళ్లుగా తనకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారని, ప్రతి రోజూ తన షెడ్యూల్స్ ప్లాన్ చేయడం, సినిమా నిర్మాతలతో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం చేసేవాడని అమితాబ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











