సహాయం కోరకముందే స్పందించిన అమితాబ్.. బాధితులు కోసం విరాళం

కరోనా వైరస్ అడ్డు అదుపు లేకుండా విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా పవర్ఫుల్ బాడీ బిల్డర్స్ ను కూడా బలిగొనడం అందరిని షాక్ కు గురి చేస్తోంది. ఇక ఈ తరుణంలో కోవిడ్ బాధితుల కోసం సినిమా సెలబ్రెటీలు వ్యాపారవేత్తలు వారికి తోచినంత సహాయం చేస్తున్నారు. ఇక మరోసారి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు.

అమితాబ్ బచ్చన్ ఫస్ట్ వేవ్ లో కోవిడ్ భారిన పడిన విషయం తెలిసిందే. అప్పటికే పలు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ 78ఏళ్ల వయసులో బిగ్ బి కరోనా నుంచి ఈజీగా బయటపడ్డారు. ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన అమితాబ్ బచ్చన్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఢిల్లీ గురుద్వారా కోవిడ్ కేర్ సెంటర్ ఈ సీనియర్ యాక్టర్ రూ. 2కోట్లు విరాళంగా ప్రకటించారు. ఢిల్లీ రాకజ్ గంజ్ లో కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్న మజిందర్ సింగ్ సిర్సా ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు.

 Amitabh Bachchan donates Rs 2 crore to Covid-19 care facility

అడగకముందే పరిస్థితి గురించి తెలుసుకొని అమితాబ్ బచ్చన్ స్పందించిన తీరుకు కృతజ్ఞతలని తెలిపారు. ఇక కోవిడ్ సెంటర్ సేవలు నేటి నుండే ప్రారంభం కాబోతున్నాయని అమితాబ్ గారు సహాయం చేసిన 2కోట్లతో విదేశాల నుంచి ఆక్సిజన్ కిట్లను సరఫరా చేయడానికి యూజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా కరోనా తీవ్రత మరింత ఎక్కువవుతోందని ఇలాంటి సమయంలో అమితాబ్ తరహాలోనే మిగతా వారు కూడా వారి ప్రాంతంలోని ప్రజలకు సహాయలు చేస్తే బావుంటుందని మజిందర్ సింగ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X