అమితాబ్‌కు నెగెటివ్.. కరోనాతో ఇంకా పోరాడుతూనే ఉన్న జూనియర్ బచ్చన్

ప్రస్తుతం కరోనా ఏ రేంజ్‌లో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశంలో కరోనా తాండవం చేస్తోంది. వారు వీరు అని తేడా లేకుండా పెద్ద పెద్ద సెలెబ్రిటీలందరూ కరోనా బారిన పడుతున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్ అని తేలడంతో దేశం మొత్తం ఉలిక్కి పడింది. వారంతా కోలుకోవాలని దేశం మొత్తం ప్రార్థనలు చేసింది.

Recommended Video

#AmitabhBachchan : కరోనా నుంచి కోలుకున్న Amitabh Bachchan! || Oneindia Telugu
బచ్చన్ ఫ్యామిలీ..

బచ్చన్ ఫ్యామిలీ..

బచ్చన్ ఫ్యామిలీలో మొదటగా అమితాబ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆపై అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఇక ఐశ్వర్యా రాయ్, ఆరాధ్య, జయా బచ్చన్ విషయంలోనూ కాస్త గందరగోళం నెలకొంది. మొదట నెగెటివ్ అని, ఆపై పాజిటివ్ అని వార్తలు వచ్చాయి.

 కోలుకున్న ఐశ్వర్య, ఆరాధ్య..

కోలుకున్న ఐశ్వర్య, ఆరాధ్య..

మొత్తానికి ఐశ్వర్య, ఆరాధ్యలకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. వీరంతా గత రెండు వారాలుగా నానావతి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐశ్వర్య, ఆరాధ్యకు నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం వారు ఇంట్లోనే క్షేమంగా ఉంటున్నారు. అయితే తాజాగా అమితాబ్ కూడా కరోనా నుంచి కోలుకున్నాడు.

 అమితాబ్‌కు నెగెటివ్..

అమితాబ్‌కు నెగెటివ్..

అమితాబ్ తాజాగా ట్వీట్ చేస్తూ..‘కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాను. ఇంటికి తిరిగి వచ్చాను. దేవుడి దయ, అమ్మనాన్నల ఆశీర్వాదం, శ్రేయాభిలాషుల, అభిమానుల ప్రార్థనలు, నానావతి హాస్పిటల్ బృందం చేసిన అనితరమైన సేవలు అన్ని కలిసి ఈ రోజు నేను ఇలా కోలుకోవడానికి కారణం అయ్యాయ'ని ఎమోషనల్ అయ్యారు.

 కోలుకోని అభిషేక్..

కోలుకోని అభిషేక్..

అమితాబ్‌కు నెగెటివ్ రావడంపై అభిషేక్ స్పందిస్తూ.. ‘తాజాగా చేసిన కొవిడ్-19 పరీక్షలో మా నాన్నకు నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఆయన ఇంట్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటారు. ఆయన కోలుకోవాలని కోరుకున్న, ప్రార్థనలు చేసిన వారికి ధన్యవాదాలు' అని పేర్కొన్నాడు.

నాకు ఇంకా పాజిటివ్..

నాకు ఇంకా పాజిటివ్..

అభిషేక్ మరో ట్వీట్ చేస్తూ.. ‘దురదృష్టవశాత్తు నాకు మళ్లీ కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నేను హాస్పిటల్‌లోనే ఉన్నాను. నా కుటుంబం కోలుకోవాలని నిరంతరం కోరుకుంటోన్న, ప్రార్థనలు చేస్తోన్న వారికి మరొకసారి ధన్యవాదాలు. మీ అందరికీ రుణపడి ఉంటాం. ఈ కరోనాను నేను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను. ప్రామిస్'అని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X