బాలీవుడ్‌లోకి అమితాబ్ మనవడి ఎంట్రీ.. దర్శకుడు ఎవరో తెలుసా?
బాలీవుడ్‌లో బంధుప్రీతి అంశంపై వివాదాస్పద చర్చ జరుగుతున్న సమయంలో మరో దిగ్జజ ఫ్యామిలీ నుంచి వారసుడు ఎంట్రీకి సిద్దమవుతున్నాడు. బాలీవుడ్‌లో ఐదు దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తన్న దిగ్దజ నటుడు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్ నందా కుమారుడే అగస్త్య నందా అనే విషయం తెలిసిందే.
బాలీవుడ్ ఎంట్రీకి ముందే తాత అమితాబ్, తల్లి శ్వేతాతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకొన్నాడు. ఎత్తుకు తగిన అందం, వర్ణంతో చూపరులను ఇట్టే ఆకట్టుకొనే విషయం అగస్త్యలో ఉందనే మాట వినిపిస్తున్నది. తన తల్లి శ్వేత పలు మార్లు త్వరలోనే తన కుమారుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తారనే సంకేతాలు ఇచ్చారు.

కరణ్ జోహర్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోలో తన సోదరుడు అభిషేక్‌తో పాల్గొన్న సమయంలో తన కుమారుడి సినీ రంగ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల రణ్‌బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ బర్త్ డే పార్టీలో కరణ్ జోహర్‌తోపాటు అగస్త్య ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అయితే కరణ్ జోహర్ చేతుల మీదుగా అగస్త్యను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఇప్పటికే అమితాబ్ ఫ్యామిలీ నుంచి అభిషేక్ బచ్చన్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ ఇంటి నుంచి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ నటించిన బ్రీత్ వెబ్ సిరీస్ జూలై 10 తేదీన అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్నది.


Click it and Unblock the Notifications











