తెలుగు రాష్ట్రాల్లో కూలీల కోసం అమితాబ్ బచ్చన్ బిగ్ బజార్ ఆఫర్.. ఫ్రీగా 12వేల కూపన్లు!
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే నటనలోనే కాదు సహాయం చేయడంలో కూడా ది బెస్ట్ హీరో అనిపించుకున్నారు. దేశంలో సామాన్యులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి తనవంతు సహాయాన్ని అందిస్తుంటారు. దేశ రక్షణ కోసం మరణించిన జవానుల యొక్క కుటుంబాలను ఎన్నో సార్లు ఆదుకున్నారు. అలాగే నష్టపోయిన రైతుల అప్పులను తీర్చి వారికి కూడా అండగా ఉన్నారు.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాల ద్వారా ఆధారపడిన కూలీల యొక్క కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే బాలీవుడ్ సినీ వర్కర్స్ కి అండగా నిలిచిన బిగ్ బి ఇప్పుడు తెలుగు సినీ కార్మికుల కోసం కూడా తనవంతు సహాయాన్ని అందించారు. టాలీవుడ్ డైలీ వర్కర్స్ కి నిత్యావసరల కోసం 12వేల బిగ్ బజార్ కూపన్స్ ని అందించారు.

ఒక్కో కూపన్ విలువ 15000 రూపయలని తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ వర్కర్స్ బీగ్ బజార్ స్టార్స్ లలో వాటిని రిడీమ్ చేసుకొని రోజు నిత్యావసరలను కొనుగోలు చేసుకోవచ్చట. ఈ విషయాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అమితాబ్ బచ్చన్ అందిస్తున్న సహాయానికి టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు నెటీజన్స్ కూడా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











