అమితాబ్ బచ్చన్ లేటెస్ట్ హెల్త్ రిపోర్ట్.. తప్పుడు వార్తలపై సీరియస్

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తప్పుడు వార్తలపై మరోసారి సీరియస్ అయ్యారు. ప్రముఖ నేషనల్ మీడియా ఆయన ఆరోగ్యంపై వివరణ ఇచ్చిన విధానంలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కరోనా వైరస్ కారణంగా అమితాబ్ బచ్చన్ నానావతి హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే.

వాళ్ళంతా కోలుకోవాలని..

వాళ్ళంతా కోలుకోవాలని..

అమితాబ్ బచ్చన్ తో పాటుగా ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం ఐశ్వర్యారాయ్, ఆరాధ్య లకి కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక వాళ్ళు కోలుకోవాలని అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

నేషనల్ మీడియాలో వైరల్ న్యూస్

నేషనల్ మీడియాలో వైరల్ న్యూస్

ఇక అమితాబ్ కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యంపై వివరణ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా ఒక నేషనల్ మీడియాలో వచ్చిన వార్త నిజమని అందరు అనుకున్నారు. ఇక ఆ వార్తపై రకరకాలుగా కథనాలు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న అమితాబ్ బచ్చన్ వెంటనే స్పందించారు.

 అమితాబ్ సీరియస్

అమితాబ్ సీరియస్

అమితాబ్ బచ్చన్ కి ఇటీవల మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని ఆయన పూర్తిగా కొలుకున్నారని మరికొన్ని రోజుల్లో విడుదల కూడా కాబోతున్నట్లు న్యూస్ రావడంతో అమితాబ్ బచ్చన్ ఆ వార్తలను కొట్టిపారేశారు. ఓ విధంగా ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Recommended Video

Ilaiyaraaja : Unknown Facts About Ilaiyaraaja
ఆ వార్తల్లో నిజం లేదు

ఆ వార్తల్లో నిజం లేదు

కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ట్వీట్ చేస్తూ.. ఇది బాధ్యతారాహిత్యంగా కూడుకున్న ప్రచారం..ఫేక్ న్యూస్, పూర్తిగా అబద్ధమైనది అంటూ అమితాబ్ బచ్చన్ సమాధానం ఇచ్చారు. దీంతో ఈ విషయంలో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చినట్లయ్యింది. ప్రస్తుతం నానావతి హాస్పిటల్ లో అమితాబ్ బచ్చన్ తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X