వలస కార్మికులకు అమితాబ్ చేయూత.. 10 బస్సుల్లో యూపీకి..

కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న విపత్కర పరిస్థితుల్లో సినీ పరిశ్రమ వారికి అండగా నిలస్తున్నది. ఆర్థికంగా చితికిపోయిన రోజు వారీ వేతన జీవులు, వలస కార్మికులకు బాలీవుడ్ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. సోనూసూద్ ఇప్పటికే తన వంతుగా భారీగా వలస జీవులను వారికి సొంత గ్రామాలకు తరలిస్తున్నారు. బిగ్‌బాస్ అమితాబ్ బచ్చన్ కూడా వలస కార్మికులను ఆదుకొనేందుకు ముందుకొచ్చారు.

తాజాగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ముంబైలోని వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించడానికి బిగ్‌బీ 10 బస్సులను ఏర్పాటు చేశారు. ముంబైలోని హాజీ అలీ దర్గా నుంచి బస్సుల్లో వలస కార్మికులు ఉత్తర ప్రదేశ్‌కు తరలి వెళ్లారు నఅి ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టు ద్వారా తెలిపారు.

 Amitabh Bachchan helping hand for UP migrants

ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చెందిన వలస కార్మికులను వారి గ్రామాలకు చేరే వేసేందుకు అమితాబ్ బచ్చన్ 10 బస్సులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ కష్టకాలంలో ఇప్పటి వరకు ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కన్ఫెడరేషన్‌కు చెందిన లక్షమంది కుటుంబాలకు అమితాబ్ నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు.

ఇదిలా ఉండగా, బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కూడా వలస కార్మికులకు అండగా నిలిచారు. దాదాపు 1300 మంది వలస కార్మికులను ఉత్తర ప్రదేశ్, బీహార్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X