విషాదంలో అమితాబ్ బచ్చన్.. గొప్ప హృదయం ఉన్న వ్యక్తి ఇకలేరంటూ..

సీనియర్ నటుడు, షోలే మూవీ ఫేమ్ జగదీప్ మరణంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇటీవల కాలంలో ఇర్ఫాన్, రిషీ కపూర్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సరోజ్ ఖాన్ లాంటి ప్రతిభావంతులైన నటులు మరణించడంతో పరిశ్రమకు పెద్ద తగిలింది. వారి మరణాలు మరిచిపోక ముందే ఎన్నో దశాబ్దాలుగా హిందీ చిత్ర పరిశ్రమకు సేవలందించిన జగ్‌దీప్ మరణించడం మరింత విషాదానికి గురిచేసింది.

తన సహచర నటుడు జగ్‌దీప్ మరణంతో బాలీవుడ్ షహెన్షా అమితాబ్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. షోలేలో సూర్మ భూపాలి పాత్రతో ప్రేక్షకుల్లో హృదయాల్లో చోటు సంపాదించుకొన్న నటుడు ఇక లేరనే సీనియర్ నటులు జీర్ణించుకోలేకపోయతున్నారు.

Amitabh Bachchan mourns actor Jagdeeps death

ఈ సందర్భంగా జగ్‌దీష్‌తో ఉన్న అనుభవాలను అమితాబ్ పంచుకొన్నారు. నటనలో ఆయనకు ఎవరూ సాటి రారు. ఆయన నటన ప్రత్యేకమైనది. అలాంటి ప్రతిభావంతుడైన నటుడితో నటించడం గర్వంగా ఉంది. షోలే, షహెన్షా చిత్రాల్లో ఆయన నటనను ఎవరూ మరిచిపోలేరు అని అమితాబ్ అన్నారు.

ఓసారి తాను రూపొందించే సినిమాలో చిన్న పాత్రను చేయమని రిక్వెస్ట్ చేస్తే అందుకు సరే అని చేశాను. దానికి తాను ఎంత సంతోషపడ్డారో నా మాటల్లో చెప్పలేను. చాలా గొప్ప హృదయం ఉన్న వ్యక్తి అని బిగ్ పేర్కొన్నారు.

జగ్‌దీష్ అసలు పేరు సయ్యద్ ఇష్తియాక్ ఆహ్మద్ జాఫ్రీ. సినిమా ప్రపంచం కోసం తన పేరును మార్చుకొన్నారు. ఆ పేరుతోనే ఎంతో లక్షలాది మంది ప్రేక్షకులు వినోదాన్ని పంచారు అని అమితాబ్ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X