For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  77ఏళ్ల వయసులో అమితాబ్ అరాచకం.. జిమ్‌లో కసిగా వర్కౌట్స్!

  |

  బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటుడిగా సినిమా వరల్డ్ లో ఎన్నో చరిత్రలు సృష్టించారు. యాక్టర్ గానే కాకుండా ఒక భారత పౌరుడిగా ప్రతి విషయంపై ఆయన స్పందించే తీరు జనాలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 50ఏళ్ల సినీ ప్రస్తానంలో బిగ్ బి సాధించిన విజయాలతో పాటు ఆయన చేసిన మంచి పనులు కూడా ఆయనకు ఒక స్పెషల్ క్రేజ్ అందించాయి.

  ఇక 77ఏళ్ళ వయసులో కూడా అమితాబ్ చురుకుదనం చూసి చాలా మంది యంగ్ యాక్టర్స్ ఆశ్చర్యపోతుంటారు. ఒకే రకమైన ఫిట్ నెస్ తో ఆరోగ్యంగా ఉండడం ఆయనకు అలవాటు. ఇకపోతే ఇటీవల తన మనవడు అగస్త్య నందతో కలిసి ఒక స్పెషల్ ఫోటోకి పొజిచ్చిన అమితాబ్ వర్కౌట్స్ చాలా కసిగా చేస్తున్నట్లు అనిపిస్తోంది. అమితబ్ అరాచకం అంటూ నెటీజన్స్ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

  amitabh bachchan new workout pic viral in social media

  'ఫైట్.. ఫిట్నెస్ కోసం ఫైట్ చేయండి.. నా మనవడిని చూసి ప్రేరణ పొందుతున్నాను' అని అమితాబ్ ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న పేద రైతులకు అమితాబ్ బచ్చన్ ప్రతి ఏడాది తన వంతు సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబలకు కూడా బిగ్ బి ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

  English summary
  Bollywood Big B Amitabh Bachchan has made many history in the film world as an actor. His response to every aspect of being an Indian citizen, not just an actor, has impressed people. Big B's achievements in 50 years of cinema have also given him a special craze.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X