twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2100 రైతుల అప్పు తీర్చిన అమితాబ్, నెక్ట్స్ పుల్వామా అమర జవాన్ల కోసం..

    |

    బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బీహార్‌లోని దాదాపు 2100 మంది రైతుల రుణాలు తన సొంత డబ్బులతో తీర్చారు. ఈ విషయాన్ని అమితాబ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు.

    'నా మాట నిలబెట్టుకున్నాను. బీహార్ రాష్ట్రానికి చెందిన 2100 మంది రైతుల అప్పులు తీర్చాను. కొందరికి ఈ డబ్బును వారి బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. మరి కొందరికి అభిషేక్, శ్వేతా మీదుగా చెక్కులు అందించడం జరిగింది' అని బిగ్ బి తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు.

    Amitabh Bachchan Pays Off Loan Of 2100 Farmers From Bihar

    ఇంతటితో నా బాధ్యత తీరలేదని అమితాబ్ వ్యాఖ్యానించారు. మరొక ప్రామిస్ కూడా నిలబెట్టుకోవాల్సి ఉంది.. పుల్వామా దాడిలో మరణించిన జవాన్ల కుటుంబ సభ్యులకు సహాయం చేయాలి. త్వరలోనే దీన్ని పూర్తి చేస్తానని వెల్లడించారు. అమితాబ్ ఇంతకు ముందు ఉత్తర‌ప్రదేశ్‌కు చెందిన 1398 రైతులు, మహారాష్ట్రకు చెందిన 350 రైతుల అప్పులు తీర్చడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే.

    అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే... 76 ఏళ్ల వయసులోనూ ఆయన అలుపు లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన 'బద్లా' ఇటీవల విడుదలవ్వగా ప్రస్తుతం ఝండ్, సైరా నరసింహారెడ్డి, తేరా యార్ హూ మే, బ్రహ్మాస్ర చిత్రాల్లో నటిస్తున్నారు.

    English summary
    "A promise made done. The farmers from Bihar who had outstanding loans, picked 2,100 of them, and paid off their amount with an OTS with the bank. Called some of them over to Janak and personally gave it to them at the hands of Shweta and Abhishek," Amitabh Bachchan wrote on his blog.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X