twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవుడిచ్చిన ఆ స్వరం మూగబోయింది.. ఎస్పీబీపై అమితాబ్ ఎమోషనల్

    |

    గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల భారత సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. కోట్ల మంది అభిమానులను ఒంటరిని చేసి వెళ్లడాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆగస్ట్ 5న కరోనా రావడం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరడం అందరికీ తెలిసిందే. కరోనాను జయించినా కూడా ఇతర సమస్యలు వెంటాడాయి. వాటితో పోరాడి ఓడిన బాలు సెప్టెంబర్ 25న మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఎస్పీబీ మృతి పట్ల సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులందరూ సంతాపాన్ని వ్యక్తి చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

    అయితే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మాత్రం ఎస్పీబీ మృతిపై స్పందించలేదు. దీంతో ఆయనపై నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా అమితాబ్ తన బ్లాగ్‌లో ఎస్పీబీకి నివాళి అర్పించారు. 'పని చేస్తుండగా మధ్యలో, మన బ్రెయిన్ ఓ రకంగా పని చేస్తూ ఉంటుంది. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేరని తెలిశాక ఆ మనసు ఇక్కడ లేదు. మనకు ఆ దేవుడు బహుమతిగా ఇచ్చిన ఆ స్వరం మూగబోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఎంతో మంది రత్నాల్లాంటి వారు స్వర్గస్థులవుతున్నారు. అయితే అది మంచి ప్రదేశం అని చెబుతుంటారు.

    Amitabh Bachchan pays tribute To SP BalaSubrahmanyam Demise

    ఈ మహమ్మారి మరొక రత్నాన్ని తీసుకెళ్లింది. గొప్వ దైవత్వంతో కూడుకున్న గాత్రం ఆయనది' అంటూ ఎస్పీబీని తలుచుకున్నాడు. ఇక ఎస్పీబీని కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్న అమితాబ్... నాటి సంగతులను వివరించాడు. 'చాలా ఏళ్ల క్రితం ఓ ఈవెంట్‌లో కలుసుకున్నాను. ఎంతో సాధారణంగా, ఎంతో అణువుకువగా ఉన్నారు.. ఆయన అందించిన సేవలు, పాడిన పాటలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఏది ఏమైనా జీవిత ప్రయాణమనేది ముందుకు సాగాల్సిందే..అంటూ అమితాబ్ ఎమోషనల్ అయ్యాడు. అమితాబ్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి పన్నెండో సీజన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

    English summary
    Amitabh Bachchan pays tribute To SP BalaSubrahmanyam Demise, In the middle of the work schedule, the mind works at a tangent that brings emotion for the departed – SP Balasubrahmanyam, the God gifted voice gone silent .. and day on day the very special have left us for the heavens .. and as they would often say ‘to a better place’ .. the pandemic claims yet another gem .. the voice of great divinity and soul..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X