Amitabh Bachchan: ఐశ్వర్య - అభిషేక్ విడాకులు.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన బిగ్ బీ!

Aishwarya Rai- Abhishek Bachchan divorce: బాలీవుడ్ మోస్ట్ బ్యూటీ కపుల్ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ - అభిషేక్ బచ్చన్. వీరిద్దరూ తమ జీవితాన్ని సంతోషంగా లీడ్ చేస్తున్నారు. కానీ, గత కొంతకాలంగా ఈ జంట మధ్య మనస్పర్ధలు తలెత్తాయని, వారు తమ వివాహబంధాన్ని తెంచు కోబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఐశ్వర్య తన ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ పుట్టినరోజు వేడుకలలో అభిషేక్ కనిపించకపోవడంతో మరోసారి రూమర్స్ గుప్పుమన్నాయి. దీంతో ఎట్టకేలకు ఐశ్వర్య- అభిషేక్‌ల విడాకుల పుకార్లపై అమితాబ్ బచ్చన్ స్వయంగా స్పందించారు. ఇంతకీ బిగ్ బీ ఏం చెప్పారంటే..

అభిషేక్ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్ ల గురించి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. వీరి తమ కెరీర్ టాప్ లో ఉన్నప్పుడు 2007లో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఆరాధ్య అనే పాప కూడా ఉంది. గత 16 ఏండ్లుగా వీరి వివాహా బంధం ఎంతో సంతోషంగా సాగుతోంది. అయితే.. గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయనీ, అభిషేక్- ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Amitabh Bachchan react on Aishwarya Rai Abhishek Bachchan divorce rumors

తాజాగా అమితాబ్ బచ్చన్ తన కొడుకు, కోడలు పై వస్తున్న విడాకుల పుకార్లపై స్పందించారు. బిగ్ బీ తన బ్లాగ్‌లో సుదీర్ఘమైన పోస్ట్‌ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో ఐశ్వర్య, అభిషేక్‌ల విడాకుల వార్తలను ప్రస్తావించారు. ఇన్నాళ్లు ఈ వార్తలపై తాను ఎందుకు స్పందించలేదో చెప్పాడు. అలాగే తమ కుటుంబం కూడా ఎందుకు స్పందించలేదో కూడా పేర్కొన్నారు.

అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో ఇలా రాశారు. 'విభిన్నంగా ఉండటానికి, జీవితంలో దాని ఉనికిని విశ్వసించడానికి అపారమైన ధైర్యం, దృఢవిశ్వాసం, నిజాయితీ అవసరం. నా కుటుంబం గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఎందుకంటే.. ఇది అది నా సామ్రాజ్యం. దాని గోప్యతను కాపాడుకుంటాను. ఊహాగానాలు కేవలం ఊహాగానాలు మాత్రమే.. ఇక అసత్య ప్రచారాలు అంటారా అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. కానీ, ధృవీకరణ లేని తప్పుడు ఊహాగానాలు. ఆ వార్తలను ముందుగా ఎలా వెరిఫై చేయాలి' అంటూ బిగ్ బి బ్లాగ్ లో సీరియస్ అయ్యారు.

Amitabh Bachchan react on Aishwarya Rai Abhishek Bachchan divorce rumors

ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా అవాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తుంటారు కొందరు. కానీ, మనం దేని గురించి ఏం చెప్పాలనుకుంటే.. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారి వృత్తి సవాలు చేయను. సమాజానికి సేవ చేయడానికి వారి ప్రయత్నాన్ని అభినందిస్తానని వ్యంగ్యంగా చెప్పాడు.

అలాంటి తప్పుడు సమాచారం అందించే వారికి చట్టపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వారు ప్రశ్నాసూచకంతో సమాచారం ఇచ్చి ఇతరులు నమ్మేలా చేస్తుంటారని అమితాబ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఇటువంటి అవాస్తవ ప్రచారాల వల్ల తాను ఎంతగానో బాధపడినట్లు ఆయన ఆ బ్లాగ్ లో రాసుకొచ్చారు బీగ్ బీ. విషయం ఏదైనా సరే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాకే ఇస్తే బాగుంటుందని అమితాబ్​ అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X